హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. కన్నడ టీవీ సీరియల్స్‌లో శోభిత పాపులర్ నటి. అయితే ఆమె గత ఏడాది పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. హైదరాబాద్‌లో సెటిలయ్యారు. ఆమె భర్త పేరు సుధీర్. ఏడాది నుంచి గచ్చిబౌలి శ్రీరామ్ నగర్లో ఉంటున్న ఆమె దాంపత్యంలో ఏమైనా సమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
శోభిత తల్లిదండ్రులు బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయినతర్వాత బెంగళూరు తరలిస్తారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు బంధువులతో పోలీసులు మాట్లాడుతున్నారు. పోలీసులు ఆమె ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. ఎలాంటి సూసైడ్ నోట్ గుర్తించలేదని తెలుస్తోంది.
శోభిత వయసు ఇరవై తొమ్మిది ఏళ్లు. బ్రహ్మగంట, నినిండాల్ వంటి కన్నడ సీరియల్స్‌లో లీడ్ రోల్ లో నటించారు. శోభిత ఆత్మహత్య కన్నడ టీవీ ఇండస్ట్రీలో సంచలనం అయింది.