వాలంటీర్లకు కాదు కానీ.. కాస్త చదువుకుని అవకాశాలు అంది పుచ్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ లింక్డ్ ఇన్ ప్రోఫైల్ ఉంటుంది.. లింక్డ్ ఇన్లో ఇప్పుడు అంతా చంద్రబాబు గురించే చర్చ జరుగుతోంది. కన్వల్ రేఖి అనే ఇండియన్ అమెరికన్ పారిశ్రామికవేత్త చంద్రబాబు గురించి పెట్టిన వివరణాత్మక పోస్ట్ వైరల్ అయింది. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేశారని తెలుసుకున్న తర్వాత ఆయన ఈ పోస్టు పెట్టారు. చంద్రబాబు ఎంత దార్శనికతతో ఉంటారో ఎలా కష్టపడతారో వివరించారు. కన్వల్ రేఖి కి ఐటీ రంగంలో.. అమెరికా వ్యాపార సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఓ ఆఫీసును హైదరాబాద్ లో ప్రారంభింపచేయడానికి చంద్రబాబు ఎలా కష్టపడ్డారో వివరించారు. అలాంటి నేతలు దేశానికి ఎంతో అవసరమన్నారు.
కన్వల్ రేఖి పోస్టుపై ఎంతో మంది వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా పరిచయడం ఉన్న వారు ఆయన పనితీరును వెల్లడిస్తున్నారు. ఓ రకంంగా రోజంతా ఇదే హాట్ టాపిక్ అయింది. చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాన్ని లింక్డ్ ఇన్లో పోస్టు చేస్తున్నారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వీరి స్పందన ద్వారానే తెస్తోంది. ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారు కానీ.. ప్రజల కోసం నిత్యంత ఆలోచించే నాయకుడ్ని ఓ క్రిమినల్ పాలకుడు కనీస ఆధారాల్లేకుండా జైల్లో పెట్టించడం అసాధారణ చర్చకు దారి తీస్తోంది.
చంద్రబాబునాయుడు పెట్టుబడుల కోసం.. వ్యాపారవేత్తలను ఒప్పించే క్రమలో ఎలాంటి కష్టాన్ని అయినా భ రించేవారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలను బాగా నచ్చింది. విదేశాల్లో పని చేస్తున్న తెలుగు వారిలో అత్యధికంగా చంద్రబాబు ఐటీ రంగానికి ఇచ్చినప్రాధాన్యం వల్లనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారంతా ఇప్పుడు సంఘిభవం తెలియచేస్తున్నారు. రోజు రోజుకు రోడ్లకు వచ్చే పర్జల సంఖ్య.. చంద్రబాబుపై తమ అభిప్రాయాలను చెప్పే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.