పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా శాఖలుంటాయి. ఎవరి పనులు వాళ్లవి. ట్రాఫిక్ విభాగంలో క్రైమ్ పోలీసులు జోక్యం చేసుకోరు. క్రైం పరిధిలోకి ట్రాఫిక్ వాళ్లు వెళ్లరు. కాకపోతే.. పోలీస్.. పోలీసే! న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత, అవసరం వాళ్లకున్నాయి. అది గ్రహించే ఓ ట్రాఫిక్ పోలీస్ – ఎప్పుడో మూసేసిన ఓ పాత కేసుని బయటకు తీస్తాడు. అసలు హంతకుడి కోసం అన్వేషణ మొదలెడతాడు. ఆ తరవాత ఏమైందో తెలియాలంటే కపటధారి సినిమా చూడాలి. సుమంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈనెల 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు థీమ్ ట్రైలర్ విడుదల చేశారు.
కన్నడ చిత్రం `కలువధారి`కి రీమేక్ ఇది. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగుతుంది. చెస్ లో రాజుని సైతం బటుడు నిలువరించగలడు.. అనే డైలాగ్ ట్రైలర్ లో ఉంది. ఈ కథ జిస్ట్ కూడా అదే. నిజాన్ని బతికించడానికి సామాన్యుడు సైతం.. చక్రవర్తులతో పోరాడొచ్చు అనేదే చూపించబోతున్నారు. ట్రైలర్లో షాట్లు, డైలాగులు, మూడ్ చూస్తుంటే.. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగే కథ. సుమంత్ లుక్ కూడా కొత్తగా అనిపిస్తోంది. తన సిన్సియర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరి తనకెలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.