కాపు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనీ కొందరు, ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే దీనిని అమలుచేయడం కష్టం కాదని కొందరు, శాసన సభలో ఎకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే చాలని కొందరు, కాపు రిజర్వేషన్ లను అమలు చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులను రాజ్యాంగపు 9 వ షెడ్యూల్ లో చేర్చితే చాలని కొందరు, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ లు కల్పించవచ్చు అని కొందరు చేస్తున్న ప్రకటనలు ఇందులో లోతులు తెలియని ప్రజలను ఆశ, నిరాశలకు, గందరగోళానికి లోను చేస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో బీసిలకు 29% రిజర్వేషన్ లు అమలు అవుతున్నాయి. దీనిలో బీసీలను ఎ, బి,సి,డి,ఇ గ్రూప్ లుగా విభజించి – ‘ఎ’ గ్రూప్ లో – ఆదిమ జాతులు, సంచార తెగలు, విముక్తజాతులు వంటి 51 కులాలను చేర్చి వీరికి 7% రిజర్వేషన్ లు – ‘బి’ గ్రూప్ లో – కుల వృత్తులు చేసుకొనే 27 వివిధ బీసి కులాలను ఉంచి వీరికి 10% రిజర్వేషన్లు – ఇక ‘సి’ గ్రూప్ లో క్రిస్టియన్ లు గా కన్వర్ట్ అయిన దళితులను ఉంచి వీరికి 1% రిజర్వేషన్ – ఇతర 46 బీసి కులాలను గ్రూప్ ‘డి’ లో ఉంచి వీరికి 7% రిజర్వేషన్ లు కల్పించారు. ఇక ‘ఇ’ గ్రూప్ లో సామాజి కంగా, ఆర్ధికంగా వెనుకబడిన 14 ముస్లిం కులాలను ఉంచి – వీరికి 4% రిజర్వే షన్ లు కల్పించారు. ఈ విధంగా ప్రస్తుతం 139 కులాలు ఈ బీసీ లలో ఉన్నాయి.
ఇలా మొత్తం బీసి లకు 29% తో పాటుగా, యస్సీలకు 15%, ఎస్టీలకు 6% తో కలిపి మొత్తం ఇప్పటికే రిజర్వేషన్ లు రాష్ట్రం లో 50% కు చేరాయి. కాబట్టి 50% దాటి రిజర్వేషన్ కల్పించాలి అంటే – ఏవైనా ప్రత్యేక పరిస్థి తులు ఉం డాలి. ఆ పరిస్థితులు కూడా న్యాయ పరీక్ష కు నిలబడాలి. రాజకీయ కారణాల కోసం ఈ రిజర్వేషన్ లు 50% దాటించాలని చూస్తే, సుప్రీమ్ కోర్ట్ తీర్పుకు వ్యతి రేకమవుతుంది.
కాపులను బీసి లలో చేర్చాలంటే – పై వర్గీకరణ ప్రకారం చూస్తే వారిని గ్రూప్ ‘డి’ లో ఉంచాలి. వీరిని గ్రూప్ ‘డి’ లో ఉంచాలని చూస్తే- ఇప్పటికే అక్కడ ఉన్న 46 కులాలకు ఇబ్బంది అవుతుంది. అంతేకాక సామాజికంగా, విద్యాపరంగా ఇతర బీసి కులాల కంటే ముందు ఉండే కాపులను బీసిలలో చేర్చితే- రాష్ట్రంలో ఆ గ్రూప్ లోని ఇతర 46 కులాల విద్య, ఉద్యోగ అవకాశాలను కాపులు తన్నుకు పోతారనే భయం ఆకులాలో ఉన్నది.
అంతే కాక స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ గ్రూప్ లతో సంభంధం లేకుండా ప్రస్తుతం బీసీలకు కల్పిస్తున్న 34% రిజర్వేషన్ లలో కూడా సింహభాగం కాపులే అక్రమిస్తారనే భయం కూడా ఆ కులాలో ఉన్నది.
కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కాపులను బీసి గ్రూప్ డి లో ఉంచితే- బీసీ కులాలతో సమస్య వస్తుంది. లేదా వారిని ఒక ప్రత్యేక గ్రూప్ గా ఉంచి వారికి ప్రత్యేకంగా కొంత శాతం రిజర్వేషన్ కల్పించాలంటే – 50% రిజర్వేషన్ లు దాట కూడదనే సుప్రీమ్ కోర్ట్ తీర్పు అడ్డం వస్తుంది.
కాబట్టి ఈ సమస్య అంత తేలి కగా పరిష్కారం అయ్యేది కాదు. భవి ష్యతు లో ఇంకా పెద్ద సమస్యగా మారు తుంది. కాబట్టి రిజర్వేషన్ కల్పిస్తూ జిఓ ఇస్తే చాలు అనే మాట, శాసన సభ లో తీర్మానాలు చేస్తే చాలు అనేవి – కేవలం రాజకీయం చేయడానికి పనికి వచ్చే మాటలే తప్ప- ఉపయోగ పడేవి కావు.
తమిళనాడు లో ప్రస్తుతం 69% రిజర్వేషన్ లు అమలు అవు తున్నాయి. తమిళనాడు లో 1992 నాటికే 69% (బీసి లకు 50% తో పాటుగా, యస్సీలకు 18%, ఎస్టీలకు 1%) రిజర్వేషన్ అమలులో ఉన్నాయి. అయితే 1992 లో ఇంద్ర సాహ్ని కేసులో ఆర్టికల్ 16(4) క్రింద రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇవ్వడంతో – 1993-94 లో ఈ రిజర్వేషన్లను మద్రాస్ హైకోర్ట్ లో ఛాలెంజ్ చేయడంతో, మద్రాస్ హైకోర్ట్ 1994-95 సంవత్సరం నుండి రిజర్వేషన్లు 50% నికి తగ్గించవలసినదిగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు ను ఛాలెంజ్ చేస్తూ తమిళ నాడు ప్రభుత్వం బీసి కులాల అభివృద్ధి కొరకు – 69% రిజర్వేషన్ లను కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించడం తో- సుప్రీమ్ కోర్ట్ కూడా రిజర్వేషన్ లను 50% కి తగ్గించ వలసినదిగా సూచించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం శాసన సభలో తమిళనాడు లో 69% రిజర్వేషన్ లు కొనసాగించేలా రాజ్యాం గంలో ఆర్టికల్ 31-సి క్రింద తగు సవరణలు చేయవలసినది కేంద్ర ప్రభు త్వాన్ని కోరుతూ 1993 లో అసెంబ్లీ లో ఏకగ్రీవంగా ఒక బిల్ పాస్ చేసి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా 1994 లోనే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి – దీన్ని అమోదించ వలసినదిగా రాష్ట్రపతి కి సూచించ డంతో – దీన్ని 1994 జూలై లో రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఆక్ట్ 45 అఫ్ 1994 ద్వారా దీన్ని చట్టం చేసి – దీన్ని న్యాయ సమీక్ష పరిధిలోకి రాకుండా రాజ్యాంగపు 9వ షెడ్యూల్ లో చేర్చవల సిందిగా కోరడం- కేంద్రం దీన్ని రాజ్యాంగపు 76 వ సవరణ చట్టం ద్వారా 9 వ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది.
అప్పటినుంచి తమిళనాడు లో 69% రిజ ర్వేషన్ అమలు అవుతున్నప్పటికీ – 50% మించి అమలవుతున్న ఈ రిజ ర్వేషన్లు ను ఛాలెంజ్ చేస్తూ దాదాపు ప్రతి సంవత్సరం – సుప్రీమ్ కోర్ట్ లో కేసులు ఫైల్ కావడం తో- సుప్రీమ్ కోర్ట్ ఈ అదనపు 19% రిజర్వేషన్ ల వల్ల – మెరిట్ లో ఉండే విద్యార్ధులు నష్టపోకుండా – ఈ అదనపు రిజర్వేషన్ వల్ల మెరిట్ లో ఉండి – విద్యా సంస్థలలో సీట్లు రాని విద్యార్థుల కొరకు అదనపు సీట్లు కల్పించ వలసినదిగా తాత్కాలిక ఆదేశాలు ఇవ్వడంతో – ఆ మేరకు అదనపు సీట్లు కేటాయిస్తున్నారు. అంటే అక్కడ విద్యా సంస్థలలో ప్రతి వంద సీట్లకు జరిగే అడ్మిషన్ ప్రక్రియలో – రిజర్వేషన్ లు లేని విద్యార్ధులు మెరిట్ లిస్టు లో సాధించే స్థానాన్ని బట్టి గరిష్టంగా 19 (69-50=19) సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడం జరుగుతోంది. అయితే ఈ కేసులలో సుప్రీమ్ కోర్ట్ తుది ఆదేశాలు వెలువడవలసి ఉన్నది.
కాపులకు – తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో లో చెప్పిన విధంగా బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలంటే నిభంధనల ప్రకారం ముందుగా…..బీసి కమిషన్ ఇతర బీసి మరియు అగ్ర కులాలతో పోలిస్తే కాపుల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్దిక, రాజకీయ వెనుక బాటు తనంపై శాస్త్రీయ పద్ధతి ద్వారా సేకరించి, విశ్లేషించి, న్యాయపరీక్షకు నిలబడేలా ఒక సమగ్ర రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇవ్వాలి. కమీషన్ నుంచి ఈ రకమైన రిపోర్ట్ వచ్చే వరకు చట్టపరంగా ప్రభుత్వం ఏమి చేయలేదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి రావాలి. ఇక రిపోర్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వానికి రెండు రకాల సమస్యలు వస్తాయి.
మొదటిది – కమిషన్ రిపోర్ట్ కాపులకు అనుకూలంగా ఉండి – ప్రభుత్వం దీనిని అమలుచేయాలను కొంటే – ప్రత్యేక శాతం రిజర్వేషన్ లేకుండా ఉన్న బీసీ జాబితాలో కే వారిని చేర్చితే- ఇప్పటికే బీసిలలో ఉన్న కులాలతో సమస్య – లేదా ప్రత్యేక శాతం కల్పించాలంటే – ప్రత్యేక పరిస్థితులను ఉటంకిస్తూ అసెంబ్లీ లో ఒక బిల్ పాస్ చేసి దాన్ని కేంద్రం ద్వారా రాష్ట్రపతి కి పంపి ఆమోదిపచేసుకొని- ఒక చట్టం చేసి దాని రాజ్యాగ సవరణ ద్వారా రాజ్యగపు 9వ షెడ్యూల్ లో చేర్పించాలి. దీనికి కేంద్రం పూర్తిగా సహకరించాలి.
అంత కష్ట పడి చేర్పించినా – మళ్లీ సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం న్యాయ సమీక్షను ఎదుర్కొని నిలబడాలి. రెండవది – ఒకవేళ కమిషన్ రిపోర్ట్ కాపులకు వ్యతిరేకం గా ఉంటే – ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం కష్టం అవుతుంది. కమిషన్ రిపోర్ట్ వ్యతిరేకంగా ఉన్నా – ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకొని కేంద్రం సహకారంతో రిజర్వే షన్ కల్పించినా అది న్యాయ పరీక్షకు నిలబడదు.
అంతే కాక రాజ్యాంగ సవరణ కు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకో వడం కష్టమే – ఎందుకంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ఈ తరహా డిమాండ్లు చాలా ఉన్నాయి. అతి సున్ని తమైన ఈ సమస్య ను పరిష్కరించడం ప్రభుత్వానికి కత్తి మీద సామే. కాబట్టి ఈ విషయం లో రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు, కేంద్రం సహకారం లేకుండా ప్రభుత్వం ఈ సమస్య నుంచి అంత త్వరగా బయటపడలేదు.
ఘర్షణాత్మక వైఖరి తో రిజర్వేషన్లు సాధించడం ఉద్యమకారులకైనా ప్రభుత్వానికైనా అసాధ్యమే! ఏ ఉద్దేశ్యమేదైనా, కారణమేదైనా, మరో దారిలేని ఇరకాటమే అయినాఅయినా ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్మాణాత్మకమైన అడుగులు వేస్తోంది. దీనిలో బాగంగా ముందుగా బీసీ కమిషన్ ను పునరుద్దరించింది. ఒక నిర్ణీత వ్యవధి లోపు రిపోర్ట్ ఇవ్వవల సినదిగా కమిషన్ కు స్పష్టమైన సూచన చేసింది. 136 కులాలుగా వున్న బిసి కార్పొరేషన్ కు 300 కొట్లరూపాయలు కేటాయించి, నాలుగు కులాలుగా వున్న కాపు కార్పొరేషన్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించింది.