ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో `ప్రాజెక్ట్ కె` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ అవ్వబోతోందని టాక్. ఇప్పటి వరకూ ఈ సినిమాకి అశ్వనీదత్ సోలో నిర్మాత. అయితే ఇప్పుడ ఈ ప్రాజెక్టులోకి కరణ్ జోహార్ కూడా ఎంటర్ అవ్వబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో కరణ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడట. హిందీలో కరణ్ హవా ఎక్కువ. బాహుబలిని అక్కడ ప్రమోట్ చేసింది కరణ్ జోహారే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్లోనూ తన పాత్ర ఉంది. `లైగర్`లోనూ తను పార్టనర్. తెలుగు సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే కరణ్ అండదండలు కావాలని మన నిర్మాతలు భావిస్తున్నారు. పైగా కరణ్ కూడా ఈమధ్య తెలుగు సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో కరణ్ ఓ భారీ బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అంతకంటే ముఖ్యంగా `ప్రాజెక్ట్ కె`లో వాటా తీసుకునే ఉద్దేశ్యాల్లో ఉన్నాడని, ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్.