ఎన్నికలకు ముందు చీరాల నియోజకవర్గం ఎన్నికల ఎంత హాట్ టాపిక్ అయిందో.. ఫలితం కూడా.. అంతే సంచలనాత్మకంగా వచ్చింది. తిరుగులేని విజయం సాధిస్తారనుకున్న ఆమంచి కృష్ణమోహన్ భారీ తేడాతో.. టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే.. ఇప్పుడు.. కరణం బలరాం ఎన్నిక చెల్లదని.. ఆమంచి కృష్ణమోహన్ .. న్యాయపోరాటం ప్రారంభించారు. కొద్ది రోజుల కిందట.. హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఆ పిటిషన్లో.. సారాంశం మాత్రం.. విచిత్రంగా ఉంది. కరణం బలరాంకు రెండో భార్య ఉన్నారని.. వారికి ఓ కూతురు కూడా ఉందని… అందువల్ల ఆయనపై అనర్హతా వేటు వేయాలని ఆమంచి డిమాండ్ చేస్తున్నారు.
కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్లో రెండో భార్య పేరు.. కుమార్తె పేరు చెప్పలేదనేది.. ఆమంచి కృష్ణమోహన్.. ఆరోపణ. ఇలా చెప్పకపోవడం.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తక్షణం అనర్హతా వేటు వేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కరణం బలరాంపై ఆమంచి ఆరోపణలు.. రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. కరణం బలరాం రెండో భార్య అంటూ.. ఆమంచి చెబుతున్న మహిళ కూడా.. మాజీ ఎమ్మెల్యేనే. ఆమె ఇప్పటికీ… రాజకీయాల్లో ఉన్నారు. ఏమైనా ఉంటే.. ఆమె చెప్పుకుంటే.. క్రెడిబులిటీ ఉంటుంది కానీ.. కొన్ని ఫోటోలు తీసుకొచ్చి.. ఫోటోలే సాక్ష్యంగా.. కరణం బలరాంకు.. రెండో భార్య ఉన్నారని.. ఆమెకో కుమార్తె ఉన్నారని.. ఆమె తండ్రి కచ్చితంగా తరణం బలరామేనని వాదిస్తున్నారు. కోర్టులో కూడా.. ఇదే తరహా పిటిషన్ వేయడం న్యాయనిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.
కరణం బలరాం కుమార్తెనే.. తనకు ఫోటోలు, సమాచారం ఇచ్చారని.. ఆమంచి కృష్ణమోహన్ చెబుతున్నారు. అవసరమైతే డీఎన్ఏ టెస్టుకు కూడా తాను సిద్ధమని.. చెబుతున్నారని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు నేరుగా.. ఆమెనే ఆమంచి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తే.. విషయంలో సీరియస్ నెస్ ఉంటుందనే అభిప్రాయం ఇతర పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది.