ఒలింపిక్ మోడల్ గ్రహీత అయిన కరణం మల్లేశ్వరి ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించింది. వివరాల్లోకి వెళితే..
ఆముదాలవలస లో పుట్టిన కరణం మల్లేశ్వరి భారతదేశానికి ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మొదటి మహిళ. 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో కంచు పతకం సాధించడం ద్వారా ఒలంపిక్ లో మెడల్ సాధించిన మొదటి భారత మహిళ గా చరిత్ర సృష్టించింది మల్లీశ్వరి. ఒలంపిక్స్ పతకం సాధించడానికి ముందే ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో, ప్రపంచ ఛాంపియన్షిప్ లోను పలుమార్లు గెలిచిన కరణం మల్లేశ్వరి పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అవార్డులు కూడా పొందింది.
తాజాగా ఢిల్లీలో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించబడింది కరణం మల్లేశ్వరి. ఇతర అకడమిక్ డిగ్రీ ల తో సంబంధం లేకుండా కేవలం స్పోర్ట్స్ లోనే డిగ్రీలు చేయగలిగే వినూత్న విధానంలో ఏర్పాటు చేయబడ్డ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ, భవిష్యత్తులో భారీగా భారతదేశానికి ఒలంపిక్స్ సాధించాలని ఆశయాన్ని కలిగి ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కరణం మల్లేశ్వరి ని ఎంచుకుంది. దీని పట్ల తెలుగు క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.