హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమాన్ని చూసైనా కొన్ని విషయాలు నేర్చుకోవాలని మాల మహానాడు అధినేత కారెం శివాజి అన్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్న పవన్ రోడ్డెక్కితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని చెప్పారు. అతను రాజకీయ నాయకుడు కాదని, సినిమా నటుడని విమర్శించారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు త్వరలోనే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఇదే డిమాండ్‌తో డిసెంబర్ 7వ తేదీన పార్లమెంట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. బీహార్, కాశ్మీర్లకు ప్యాకేజ్‌లు ఇచ్చి ఏపీకి మాత్రం మొండిచెయ్యి చూపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను రక్షించుకోటానికి త్వరలోనే జాతీయ సదస్సును నిర్వహించబోతున్నామని చెప్పారు. గ్రామాల్లోని దళితుల భూములను గ్రామ పెద్దలే ఆక్రమించకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ-ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో ఒక్క వ్యక్తికి కూడా ఇంతవరకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.