కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగిపోయే మెజార్టీ కాకపోయినా ఓ మాదిరి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండ గంటల తర్వాత కనీసం 120 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం చూపిస్తున్నారు. అటూ ఇటూగా చివరి ఫలితం కూడా ఇలాగే వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. 113 స్థానాలు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వలేదు. ఇండియా టుడే మై యాక్సిస్ ఒక్కటే కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధిస్తుందని అంచనా వేశారు. ఆ ప్రకారమే ఫలితాలు వస్తున్నాయని అనుకోవచ్చు. హోరోహోరీ పోరు ఉందని స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసిన మోదీ కి కూడా ఈ ఫలితాలు ఇబ్బందికమే. బెంగళూరులో ఆయన రెండు రోజుల పాటు రోడ్ షోలు చేశారు.కానీ బెంగళూరులో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ ఆశలు గల్లంతయ్యాయి. ఆ పార్టీకి 20 ప్లస్ సీట్లు లభించే అవకాశం ఉంది. ఫలితాలు చివరి క్షణంలో తిరగబడకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లే అనుకోవచ్చు.