కర్ణాటక భారతీయ జనతా పార్టీకి .. బ్లూఫిల్మ్స్కు ఏదో తెలియని లింక్ ఉన్నట్లుగా ఉంది. ఆపార్టీకి చెందిన నేతలు వరుసగా ఆశ్లీల దృశ్యాల కేసుల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి. గతంలో అసెంబ్లీలలోనే ఫోన్లలో పోర్న్ చూస్తూ దొరికిపోయిన ఘనత బీజేపీ ప్రజాప్రతినిధులకు ఉంది. తాజాగా ఓ మంత్రి నేరుగా ఓ యువతిని ఉద్యోగం పేరుతో ఆశపెట్టి శారీరకంగా లొంగ దీసుకున్న వ్యవహారంపై వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మంత్రి పేరు రమేష్ జార్కిహోళి. వీడియోలు సంచలనం సృష్టించడంతో ఆయనతో బీజేపీ హైకమాండ్ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. యడ్యూరప్ప కూడా ఆమోదించి.. గవర్నర్‌కు పంపారు. రమేష్ జార్కిహోళి ..కర్ణాకలో బీజేపీ సర్కార్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.
అంతకు ముందు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. తన వర్గానికి చెందిన వారిని బీజేపీలో చేర్పించి.. రాజీనామాలు చేశారు. ఎన్నికల్లో గెలిచారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మంత్రి పదవులు పొందారు. అయితే క్షణిక సుఖాల కోసం ఆయన దారి తప్పారు. తన వద్దకు వచ్చిన మహిళను లోబర్చుకున్నారు. ఆ యువతి కూడా.. ప్లాన్డ్ గా మొత్తం వ్యవహారాలన్నీ రికార్డు చేసింది. వీడియో కాల్స్ ను కూడా రికార్డు చేసింది. సెక్స్ టేపుల్ని కూడా రికార్డు చేసింది. వాటిని మొత్తం ఓ సామాజిక కార్యకర్తకు ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీడియాకు విడుదల చేశారు.
దాంతో రమేష్ జార్కిహోళి పరువు పోయింది. బీజేపీ తలదించుకుంది. ఆయనతో రాజీనామా చేయించింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రిపై ఆమె హనీ ట్రాప్‌కు పాల్పడ్డారని రమేష్ అనుచరులు అంటున్నారు. హనీ ట్రాప్ అయినా.. మరొకటి అయినా… ఇప్పుడు ఇరుక్కుంది మాత్రం మంత్రే. అధికారంలో ఉండగా ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగితే.. ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి