భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అంతే భారతీయ జనతా పార్టీకి అంతకు మించిన ఆయుధం లేదన్నట్లుగా ఒక్క సారిగా జూలు విదుల్చుకుంది. అన్ని విషయాలు పక్కన పెట్టేసింది. భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తారా అని యుద్ధం చేస్తున్నట్లుగా ఎన్నికల్లో ప్రకటనలు ప్రారంభించారు. నిజానికి భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పడానికి కాంగ్రెస్ కు చాలా కారణాలు ఉన్నాయి. భజరంగ్ దళ్ పేరుతో దాడులు.. అరాచకాలను అల్లరి మూకలు చేపడుతోంది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హిజాబ్ వివాదం సమయంలో..ఇతర సమయంలో వారి తీరు వివాదాస్పదం అయింది.
అయితే భజరంగ్ దళ్ న నిషేధించడం ఆరెస్సెస్ ను నిషేధించడం అన్నట్లుగా బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మరో ఉగ్రవాద సంస్థతో ముడిపెట్టి హిందూ సంస్థను అవమానించారని అంటున్నారు. దీన్నే సెంటిమెంట్ గా మార్చేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పి కొట్టేందుకు .. ఆంజనేయుల ఆలయాల్ని కాపాడతామని ప్రత్యేకంగా నిధులిచ్చి అభివృద్ది చేస్తామని చెప్పడం ప్రారంభించింది.
బీజేపీకి ఇలాంటి వివాదాలతో రాజకీయం చేసి ఓట్లు దండుకోవడం అంటే..చాలా ఇష్టం. ఇప్పుడు కర్ణాటకలో పొలిటికల్ డ్రామా ప్రారంభమయింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ బొమ్మై ప్రభుత్వం మళ్లీ రావాలా వద్దా అన్నదానిపైనే ఓటింగ్ జరుగుతుంది. ఎజెండాను ఇప్పుడు మార్చలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.దాదాపుగా అన్ని సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి.