తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఫెడరల్ ఫ్రంట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కనీసం కొన్ని పార్టీలతో అయినా..కూటమిని పెట్టి.. వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక విమానాలతో.. ఆయా రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. కోల్ కతా, బెంగుళూరు, చెన్నై కేసీఆర్ పర్యటించి వాటి జాబితాలో ఉన్నాయి. ముందు ముందు మరిన్ని రాష్ట్రాలకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేసీఆర్.. వెళ్లి కలసి వచ్చిన వారిలో కానీ.. వచ్చి కలసి వెళ్లిన వారిలో కానీ.. ఒక్కరంటే..ఒక్కరు కూడా…ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమవుతామని చెప్పేలేదు. కొంత మంది అయితే కేసీఆర్ అసలు ఫ్రంట్ రాజకీయాలపై చర్చించలేదని చెప్పి గాలి తీసేశారు.
అయినా సరే కేసీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చేలా వందల కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. పేపర్లు, టీవీల్లో అన్ని భాషల్లోనూ ప్రకటనలు హోరెత్తిపోయాయి. అప్పనంగా నాలుగువేలు ఇస్తున్నారంటే.. ఏదో గొప్ప పని చేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఆశ పడతారు..తనకు బోలెడంత క్రేజ్ వస్తుందనుకున్నారు. ఈ ప్రయత్నాలు ఇలా సాగుతూండగానే.. కర్ణాటక సంక్షోభం వచ్చింది. తనతో వస్తారని ఆశలు పెట్టుకున్న దేవేగౌడ.. మరో మాట లేకుండా కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. బీజేపీ వైపు వెళ్తే కేసీఆర్ స్వాగతించేవారు కానీ… కాంగ్రెస్ వైపు వెళ్తే తట్టుకోలేరు. అందుకే కుమారస్వామి… కర్ణాటకలో జరుగుతున్న ప్రజాస్వామ్య హననంపై … పోరాడేందుకు..కలసి రావాలని కేసీఆర్‌కు పేరు పెట్టి పిలిచినా.. స్పందించేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇప్పుడు…తాను దేవేగౌడకు మద్దతు ప్రకటిస్తే అది బీజేపీకి వ్యతిరేకమవుతుంది. ఇటీవలి కాలంలో కేంద్రానికి వ్యతిరేకంగా పెట్టిన ఆర్థిక మంత్రుల సమావేశాలకు కూడా… తెలంగాణ హాజరు కాలేదు. ఇప్పుడు జేడీఎస్‌కు మద్దతు ప్రకటిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో… ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకునేవారు.. ప్రాంతీయ పార్టీలకు ఏ కష్టం వచ్చినా.. ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. కానీ.. .కేసీఆర్ స్పందించడానికి కూడా వెనుకాడుతూండటమేమిటన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. స్వయంగా తన కూటమిలో చేరమని ఆహ్వానించిన పార్టీనే… కష్టాల్లో ఉన్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇలా అయితే.. ఒక్కటంటే..ఒక్క పార్టీ కూడా కేసీఆర్ వైపు చూసే అవకాశం లేదు. అంే.. ఫెడరల్ ఫ్రంట్‌కు ఢిల్లీలో ఆఫీసు పెట్టుకున్నా.. అందులో టీఆర్ఎస్ ఒక్కటే ఉంటుంది. అందులో అనుమానాలుండవ్.