కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా… హాట్ టాపిక్ అయ్యాయి. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు… అదీ..దక్షిణాది రాష్ట్ర ఎన్నికలపై.. ఇంగ్లి,ష్ మీడియా… రోజంతా కథనాలు నడపడం.. బహుశా గతంలో ఎప్పుడూ లేదేమో. ఎప్పటికప్పుడు పోలింగ్ పర్సంటేజీలు ఇస్తూ… పోలింగ్ ముగిసిన మరుక్షణం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పదుల సంఖ్యలో వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్… ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠను మరింత పెంచాయి తప్ప…. క్లారిటీ ఇవ్వలేకపోయాయి. ఎవరికి తోచిన లెక్కలను వారు ప్రసారం చేసేశారు.
నిజానికి ఒకప్పుడు సర్వేలన్నా.. ఎగ్జిట్ పోల్స్ అన్నా… ప్రకటించాలంటే.. మీడియా సంస్థలు చాలా పెద్ద కసరత్తు చేసేవి. శాస్త్రీయంగా శాంపిల్స్ తీసుకుని ఎనాలసిస్ చేసి ఫలితాలు ప్రకటించేవారు. కానీ ఇప్పుడు… పైకి మాత్రం వేలు, లక్షల శాంపిల్స్‌తో ఫలానా సంస్థతో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేశామని చెప్పుకొస్తూంంటారు. కానీ ఆయన సంస్థల్లో ఉద్యోగులు కూడా వెళ్లమీద పెట్టగలిగినంత మందే ఉంటారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారంటే… వాళ్ల ఆఫీసుల్లో కూర్చుని.. వాళ్ల క్లైంట్లకు ఎంతకావాలో అంత.. రాసి ఇచ్చేస్తారు. ఇవే ఎగ్డిట్ పోల్స్. తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడానికో…తమకే గాలి ఉందని నిరూపించడానికో… రాజకీయ పార్టీలు.. సర్వేలనే అడ్డదారులను తొక్కడం గత రెండు దశాబ్దాల కాలంలో ఎక్కువయిపోయింది. మొదట్లో.. ఆయా సంస్థలు ప్రకటించే సర్వేలు.. అటూ ఇటుగా నమ్మదగ్గట్లుగా ఉండేవి. కానీ రాను రాను మీడియాలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం.. మీడియా సంస్థలు… తమ మనుగడ కోసం.. రాజకీయ పార్టీలు, నేతలకు ఊడిగం చేయడం ప్రారంభించినప్పటి నుంచి.. సర్వేలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కూ అదే పరిస్థితి వచ్చింది.
ఎగ్జిట్ పోల్స్‌లో కొత్తగా ఎవరూ ఏమీ చెప్పలేదు. కొన్ని రోజులుగా… ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ.. యథేచ్చగా.. సర్వేలను మీడియా సంస్థలు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారో.. ఆ పార్టీకి … ఆ మీడియా సంస్థ ఎడ్జ్ చూపిస్తూ వస్తోంది. బీజేపీకి సపోర్ట్‌గా ఉన్న మీడియా అంతా వ్యూహాత్మకంగా మొదట్లో బీజేపీ వెనుకబడిందని.. మోదీ వచ్చిన తర్వాత మారిందని.. ఇప్పుడు బీజేపీ హవా అని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చేది. కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలున్న మీడియా… ఆ పార్టీకి మెజార్టీ కట్టబెట్టింది. ఇలా.. పోటీ పోటీగా… రెండు పార్టీలకు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మద్దతు పలికాయి. దీంతో ప్రజలు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
ఒకటి నుంచి పది వరకు బొర్లించి ఉన్న గ్లాసుల్లో.. ఒక్క దాంట్లో మాత్రం నిమ్మకాయ ఉందని.. దాన్ని ఎవరు కనిపెడితే.. వారే శాస్త్రవేత్త అని పోటీ పెట్టి పది మందికి చాన్సిస్తే…. అందులో ఎవడో ఒకడికి లాటరీ తగులుతుంది. వాడు నిజంగా తెలివిలేని వాడే కావొచ్చు.. కానీ కచ్చితంగా కనిపెట్టినట్లు బిల్డప్ ఇచ్చి శాస్త్రవేత్త అయిపోతాడు. రేపు కౌంటింగ్ రోజు తేలిది కూడా ఇదే. అన్ని మీడియా సంస్థలు అన్ని రాకల అంకెలను వేశాయి. ఏదో ఒకదానికి ఫలితాలు దగ్గరగా వస్తాడు. ఆ మీడియా సంస్థే … ఆ రోజుకు గొప్ప రాజకీయనిపుణుడు. నిజానికి మాత్రం… అందరూ… సొంత రాజకీయ భావజాలాన్ని బుర్రలో నింపుకుని… సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వాళ్లే.