కర్ణాటకలో నేడు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వం కొలువు దీరనుంది. కాంగ్రెస్‌కు ఉన్న సీట్లలో సగం కూడా లేకపోయినా లక్ బై చాన్స్ అన్నట్లు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతోంది. సీఎం పీఠం ఇస్తామన్నారు కాబట్టే.. కుమారస్వామి కూడా పొత్తుకు నిమిషాల్లోనే ఆమోదం తెలిపారు. యడ్యూరప్ప రాజీనామాతో… అప్పటి వరకు జరిగిన పొలిటికల్ యాక్షన్ ధ్రిల్లర్కు ముగిసిపోయినట్లుంది. కానీ అసలు మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.
ముఖ్యమంత్రి పదవి జేడీఎస్‌కే వదిలేసినా.. రిమోట్‌ను మాత్రం తమ దగ్గరే ఉంచుకోవాలనుకున్న కాంగ్రెస్ అందులో సక్సెస్ అయింది. డిప్యూటీ సీఎం పోస్ట్ లేకుండా చేద్దామని కుమారస్వామి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పీసీసీ చీఫ్ పరమేశ్వరకు నెంబర్ టూ పోస్ట్ ఇవ్వకతప్పలేదు. నిజానికి గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ తరపున పరమేశ్వర సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోయారు. ఆ సీటు సిద్దరామయ్యకి దక్కింది. స్పీకర్ పదవి కూడా కాంగ్రెస్ చేతిలోకే తీసుకుంటున్నారు. మొత్తం 34 మంది మంత్రుల్లో 22 మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. జేడీఎస్‌కు ఖాతాలో పన్నెండు మంది మాత్రమే ఉంటారు.
అంటే కేబినెట్లో కాంగ్రెస్‌దే డామినేషన్. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్‌దే డామినేషన్. పైగా.. రెండు పార్టీల మధ్య పొత్తు సజావుగా ఉన్నంత కాలం ఏ సమస్యా రాదు. కానీ అదంత తేలికైనా విషయం కాదు. పాలనలో… రెండు పార్టీల మధ్య అంతులేని అభిప్రాయబేధాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్ వారు చూసుకుంటారు. అంతిమంగా ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటవుతుంది కానీ… ప్రస్తుతం కర్ణాటక సీఎంకు అ అంతిమ మాట చెప్పేంత స్వేచ్చ దొరకకపోవచ్చు. తనే స్వేచ్ఛ తీసుకోవలాంటే… అదీ రాజకీయ సంక్షోభానికి దారి తీయవచ్చు. పైగా.. రెండు పార్టీల పార్టనర్‌షిప్‌ను సమన్వయం చేసేందుకు సిద్దారమయ్యను నియమించారు. ఆయన మార్క్ రాజకీయాలతో పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. కెప్టెన్ కుర్చీలో కుమారస్వామి కూర్చుకుంటారు కానీ.. కాంగ్రెస్ బ్యాటింగ్ చేస్తుంది. ఈ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందో.. రిటైర్డ్ హర్ట్ అవుతుందో.. కుమారస్వామి చెప్పినట్లు… ” టైమ్ విల్ డిసైడ్..”