కర్ణాటకలో ఎర్లీ ట్రెండ్స్ ను మించిన కాంగ్రెస్ వేవ్ ఫలితాల్లో కనిపించింది. సాధారణ మెజార్టీకి 113 స్థానాలు అవసరం కాగా.. మహా అయితే మరో రెండు, మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఎక్కువగా గెల్చుకుంటుందని అనుకున్నారు . కానీ ఎన్నికల కౌంటింగ్ రౌండ్లు పెరిగిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత పెరుగుతూ పోయింది. నికరంగా 132 స్థానాలు ఖాయమయ్యాయి. అంటే ఎలాంటి ఆపరేషన్ కమల్స్ కూడా వర్కవుట్ కాని తీర్పు వచ్చింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
బీజేపీ పరాజయం మొత్తం మోదీ ఖాతాలోకే పడిపోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి మొత్తం షో ఆయనదే. అంతే కాదు మొత్తం కేంద్ర పార్టీని రంగంలోకి దింపారు. కర్ణాటక నలుమూలలా తిరిగారు. పోల్ స్ట్రాటజీలు ఆయనే డిసైడ్ చేశారు. బజరంగ్ దళ్ గురించి..కేరళ స్టోరీల గురించి చెప్పారు. అయితే ఏమీ కాంగ్రెస్ ను కాపాడలేదు సరి కదా.. మరింత దిగజార్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం ఎన్నికల ఫ లితాల్లో స్పష్టమయింది.
కాంగ్రెస్ నేతలు గెలుపు క్రెడిట్ సాధారణంగా రాహుల్ గాంధీకి ఇస్తారు. ఓడినా ఆయన నెత్తి మీద వేసేవాళ్లేమో కానీ బీజేపీ నేతలుక మాత్రం ఇప్పుడు ఈ ఓటమి క్రెడిట్ ను మోదీకి ఇచ్చే ప్రయత్నమే చేయరు. అందరూ బాధ్యులేనని అంటున్నారు. మోదీదే బాధ్యత అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు.