కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ కూటమి పతనానికి కారణం అయినా.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరూ… మాజీలయ్యారు. అందరిపైనా.. అనర్హతా వేటు వేస్తూ.. స్పీకర్ రమేష్ కుమార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వారు ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. మళ్లీ వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వారికి పోటీ చేసే అవకాశంమ ఉంది. మూడు రోజుల కిందట.. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసిన స్పీకర్.. తాజాగా 14మందిపై అదే అస్త్రాన్ని ప్రయోగించారు. ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కాగా… 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా.. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్గా గెలిచి.. తర్వాత కాంగ్రెస్లో చేరిన మరో ఎమ్మెల్యే అనర్హతా వేటుకు గురైన వారిలో ఉన్నారు.
సోమవారం యడియూరప్ప బలపరీక్ష జరగనుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లయింది. కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 224. అయితే 17 మందిపై వేటు పడటంతో ఈ సంఖ్య 207కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105 కాగా.. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు.. స్వతంత్రులు ఇద్దరు కలిపి ఆ పార్టీ బలం 107 ఉంది. దీంతో బలపరీక్షలో గటెక్కడం.. యడియూరప్పకు.. చాలా ఈజీ. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది. మంత్రి పదవుల కోసం ఆశతోనే ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గారన్న ఉద్దేశంతో.. వారిని రెంటికి చెడ్డ రేవడిని చేసే ఉద్దేశంతోనే… అనర్హతా వేట వేసినట్లు చెబుతున్నారు.
యడియూరప్ప… సోమవారం అసెంబ్లీలో బలం నిరూపించుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆయనకు అతి పెద్ద గండం పొంచి ఉంటుంది. అనర్హతా వేటుకు గురైన 17 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో … ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగడం ఖాయం. వీటిలో… కనీసం.. ఎనిమిది నుంచి పది స్థానాలు బీజేపీ గెల్చుకుంటేనే… ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే.. మళ్లీ మైనార్టీలో పడిపోతుంది. అదే.. తమ సిట్టింగ్ స్థానాలన్నింటినీ… కాంగ్రెస్, జేడీఎస్ నిలబెట్టుకుంటే మాత్రం.. మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. యడియూరప్పకు.. మళ్లీ ఆశాభంగమే ఎదురవుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో నష్టపోయింది.. కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్స్ మాత్రమే..!