నయనతారను గ్లామర్ రోల్స్‌లో చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ టీజర్ కొత్తగా వుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కర్తవ్యం ‘ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఇదీ నయనతార షోనే. కాకపోతే గ్లామర్ షో కాదు. సీరియస్ అండ్ పవర్ఫుల్ షో! తమిళ్ హిట్ ‘ఆరమ్’కి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా వస్తున్న ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో నయనతార నటించారు. “ప్రజలకి ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కాని చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు” – టీజర్లో ఈ డైలాగ్ వింటే నయనతార క్యారెక్టరైజేషన్ ఈజీగా అర్థమవుతుంది. ప్రజల పక్షాన నిలబడి చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్ర అన్నమాట. అలాగే, టీజర్లో “పిడుగులు పడినా నిను విడిపోమే… చీకటి వెనుక వెలుగే వుంది…
ఇది విధి గీతో… మా తలా రాతో” అంటూ సాగే పాట సినిమా గురించి ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేసేలా వుంది.