నెక్ట్స్ ఆపరేషన్ లోటస్ కు బలయ్యేది వైసీపీనే అని చిదంబరం కుమారుడు.. తమిళనాడు ఎంపీ కార్తీ చిదంబరం ఓ ట్వీట్ పెట్టారు. ఆయనకు ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి అయి ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.
వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీ రాజ్యసభ సభ్యులేం పార్టీకి వీర విధేయులు కాదు.. వ్యాపార ప్రముఖులే ఎక్కువ. పరిమళ్ నత్వానీ వైసీపీ, కృష్ణయ్య వంటి వాళ్లు బీజేపీ పిలిస్తే పరుగున వెళ్తారు. బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సహా విజయసాయిరెడ్డి అందరూ లైన్లోనే ఉంటారు. ఎందుకంటే… బీజేపీ రావాలంటే.. రాలేమని చెప్పే పరిస్థితి ఉండనంత లగేజీ వీరికి ఉంది.
తమ ఎంపీలంతా వెళ్లి వైసీపీలో చేరినా జగన్ మోహన్ రెడ్డికి నోరెత్తే పరిస్థితి లేదు. ఆయన బలహీనతను ఆసరా చేసుకుని బీజేపీ ఏదో చేయబోతోంది. అదేంటో… ఒకటి, రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.