కార్తి హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుగు 360 ఇది వరకే చెప్పింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాకి `రెంచ్ రాజు` అనే టైటిల్ పెట్టినట్టు అత్యంత విశ్వసనీయమైన సమాచారం. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఓకే చేయించుకొన్నాడు పరశురామ్. విజయ్ తరవాతే కార్తీతో సినిమా ఉంటుందనుకొన్నారు. కానీ… ఇప్పుడు అనూహ్యంగా కార్తి సినిమా ముందుకు వచ్చింది. ఇది పూర్తయ్యాకే… విజయ్ దేవరకొండ సినిమా ఉంటుంది.
బన్నీతో సినిమా నిజమేనా?
మరోవైపు అల్లు అర్జున్‌తో పరశురామ్ ఓ సినిమా ఓకే చేయించుకొన్నాడన్న వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 తరవాత పరశురామ్ సినిమా ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటిలో ఏమాత్రం నిజం లేదు. గీతా ఆర్ట్స్‌కి పరశురామ్ ఓ సినిమా చేయాలి. విజయ్‌తోనే ఆ సినిమా ఉండాల్సింది. కానీ అనూహ్యంగా.. ఆ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది. గీతాలో చేయాల్సిన సినిమా దిల్ రాజు బ్యానర్ కి ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్న విషయంపైనే ఇప్పుడు పరశురామ్ కీ, అల్లు అరవింద్‌కీ గొడవ జరుగుతోంది. అల్లుని కూల్ చేసేందుకు పరశురామ్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రాజెక్టు పక్కన పెట్టి కార్తి సినిమాని లైన్లోకి తెచ్చాడు. కార్తీ సినిమా పూర్తయ్యేసరికి టైమ్ పడుతుంది. ఆలోగా గీతా ఆర్ట్స్‌తో వ్యవహారం సద్దుమణిగే అవవకాశం ఉంది. గీతాలో పరశురామ్ ఓ సినిమా చేస్తాడు. అయితే.. అందులో హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు.