కార్తికేయకి మాంచి హిట్ పడింది ఆర్ ఎక్స్ 100తో. హీరోగా ఇండస్ట్రీలో నిలబడిపోడానికి అవకాశం వుండే హిట్ ఇది. కానీ దాన్ని చక్కగా వాడుకోలేకపోయాడు కార్తికేయ. హిప్పీ చేశాడు. తలనొప్పిగా మారిందా సినిమా. తర్వాత ‘గుణ’ కూడా ప్లాప్. ఈ గ్యాప్ లో ఓ రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో. రాంగ్ చాయిస్ అని ఎవరో అనడం కాదు. స్వయంగా కార్తికేయనే తన సన్నిహితుల దగ్గర ఈ విషయం లో బాధ పడుతున్నాడట.
విలన్ రోల్ ట్రై చేశాడు కార్తికేయ గ్యాంగ్ లీడర్ లో. వాస్తవానికి కార్తికేయ ఈ పాత్ర ఒప్పుకున్నది నాని కోసం కాదు. విక్రమ్ కె. కుమార్ కోసం. సినిమా చూసిన తర్వాత ఆ పాత్ర ఏమంత గొప్పగా రాలేదు. పైగా ఓవర్ నెగిటివ్. ఇదే విషయం ఇండస్ట్రీలో ఓ పెద్దాయన కార్తికేయ కి క్లాస్ పీకాడట. “తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు. తండ్రిని చంపే క్రూరమైన పాత్ర ఎందుకు చేశావ్. అసలు అందులో నీకు ఏం విలనిజం కనిపించింది.? రెపొద్దున్న నీవు మళ్ళీ తెరపై హీరోగా కనబడితే ఆ ఇంపాక్ట్ వుంటుంది. విలన్ రోల్ కి కూడ కొన్ని లెక్కలు వుంటాయి. నీ కెరీర్ కి ఇలాంటి పాత్రలు అస్సల్ హెల్ప్ చేయవు”. అని ఓ పెద్దాయన కార్తికేయకి సలహా ఇచ్చాడట.
“అవును సర్ సినిమా చూసిన తర్వాత నాకె అనిపించింది. ఇలాంటి పాత్ర అవసరమా ? అని. ఇక పై జాగ్రత్తపడతాను” అని చెప్పాడట కార్తికేయ. నిజమే..హీరో గా సెటిల్ అవ్వకుండా ఇలాంటి పాత్రలు చేయడం అనవసరం.