మెగాస్టార్ చిరంజీవి ఓ ట్రెండ్ సెట్టర్. అన్నయ్య అడుగు జాడల్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కూడా తిరిగులేని కధానాయుకుడిగా పవర్ స్టార్ గా ఎదిగారు. అయితే ఈ స్టార్ డమ్ అంతా సింగిల్ నైట్ లో వచ్చేయలేదు. కెరీర్ ప్రారంభంలో వాళ్ళు ఎంచుకున్న పాత్రలు, కధలు .. అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయించాయి. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరీర్ మొదలుపెట్టడంతోనే ఆయనేం మాస్ జపం చేస్తూ వూగిపోలేదు. తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి.. ఇలా ఒకొక్కమెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిజంలో ఎవరెస్ట్ స్థాయిలో వున్నారు.
అయితే అదే కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మాత్రం ఈ ధోరణి కనిపించలేదు. మొదటినుండే ‘మాస్’ అంటూ ఊగిపోయారు. సాయి ధరమ్ తేజ్ నే తీసుకుందాం. తొలి సినిమా రేయ్ అంటూ అరుపులు కేకలు లతో ప్రేక్షకులను భయపెట్టేశాడు. ఆ సినిమా మొదటిగా రిలీజ్ కాలేదు కానీ ఒకవేళ అదే సాయి మొదటి సినిమా అయ్యింటే మాత్రం కష్టమే. అయితే తర్వాత కూడా పంక్తు కమర్షియల్ సినిమాలే చేశాడు. అయితే రీసెంట్ సినిమాలు తిక్క , విన్నర్ సినిమాలతో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇప్పుడు సాయికి మావయ్య పవన్ కళ్యాణ్ సినిమాలు గుర్తుకు వచ్చాయి. తొలి ప్రేమ లాంటి ఓ స్వీట్ లవ్ స్టోరి ఒకటి చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో దర్శకుడు కరుణాకరన్ తో ఓ సినిమా ను కూడా ఫిక్స్ చేసుకున్నాడట. మొత్తానికి సాయి ఆలోచన బాగానే వుంది కానీ,ఇప్పుడు కరుణాకరన్ మునపటి ఫామ్ లో లేడు. మరి ఆయన నుండి ఎలాంటి ప్రేమకధ వస్తుందో చూడాలి.