‘తొలి ప్రేమ’తో ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు కరుణాకరన్. హిట్టు, ఫ్లాపులు ఎలా ఉన్నా సరే.. రొమాంటిక్ కామెడీ సినిమాల్ని తీయడం, దానికి ఫ్యామిలీ టచ్ ఇవ్వడంలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసేశాడు. 2018లో `తేజ్ ఐలవ్యూ` తరవాత… మళ్లీ కనిపించలేదు కరుణాకరన్. తన గురించి టాలీవుడ్ మర్చిపోతోందనుకుంటున్న తరుణంలో.. మళ్లీ టచ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.
లాక్ డౌన్ సమయంలో కరుణాకరన్ ఓ ఆసక్తికరమైన కథని తయారు చేసుకున్నాడట. ఈ కథని ఓ యంగ్ హీరోకి చెప్పాలని, తనతో ప్రాజెక్టు ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆ హీరోతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈలోగా ఓ బడా హీరో `ఫ్యామిలీ కథలేమైనా ఉంటే చెప్పు..` అని కరుణాకరన్ ని పిలిపించినట్టు తెలుస్తోంది. ఆ హీరోతో.. కరుణాకరణ్ ఇది వరకు ఓ సినిమా తీసి, హిట్టుకూడా ఇచ్చాడు. ఆ హీరోకి తగిన కథని రెడీ చేసినా, ఆ యంగ్ హీరో.. కరుణ కథకు ఓకే చెప్పినా – కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించడం ఖాయం.