పవన్ కళ్యాణ్ తాజగా చిత్రం ‘కాటమరాయుడు’ మరి కొద్ది గంటల్లో థియేటర్ కి వచ్చేసింది. ప్రమోషన్స్ మాట పక్కన పెడితే.. ఈ సినిమాపై వివాదాలు మాత్రం నడుస్తున్నాయి. భారీ అంచనాలు మోసుకొచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని కొని సగానికి సగం నష్టపోయినవాళ్లు చాలామంది ఉన్నారు. సర్దార్ వల్ల నష్టపోయిన పంపిణీదారులకు కాటమరాయుడు సినిమా ఇచ్చి ఆదుకొంటానని పవన్ మాటిచ్చాడు. అయితే అలా జరగలేదు. . సర్దార్ కొన్న ఏ ఒక్కరికీ కాటమరాయుడు అమ్మలేదు. దీంతో సర్దార్ బాదితులు అంతా నిరాహార దీక్షకు దిగారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మనుసు కరగలేదు. ఆ దీక్షను ఆయన పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు ఇంకో వివాదం ఏమిటంటే.. తొలి రెండు వారాల పాటు కాటమరాయుడు సినిమాను ప్రేక్షకులు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షులు జి.ఎల్.నర్సింహారావు, సినీ అభిమాన సంఘాల ఐకాస అధ్యక్షులు పూర్ణచందర్. భారీ వసూళ్ళు దురాశతో కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని, రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ కొందరు థియేటర్ యాజమాన్యాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతి పొందారని, అందుకే తొలి రెండు వారాల పాటు కాటమరాయుడు సినిమాను ప్రేక్షకులు స్వచ్ఛందంగా బహిష్కరించాలని అంటున్నారు.
అయితే ఎన్ని వివాదాలు వచ్చిన స్పదించే మూడ్ లో లేరు కాటమరాయుడు రూపకర్తలు. కనీసం పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్ వ్యూ ఇస్తే.. ఇవన్నీ ప్రస్తావించే అవకాశం వుండేది. కానీ కాటమరాయుడు విషయంలో అది జరగడం లేదు.