బడా హీరో సినిమా అంటే ఆటోమేటిక్ గా క్రేజ్ ఏర్పడిపోతుంది. సినిమా టాక్ తో సంబధం లేకుండా తొలి మూడు రోజుల వసూళ్ళు వచ్చేస్తాయి. అలాని సినిమాని వదిలేయారు. కావాల్సిన ప్రమోషన్స్ చేసుకుంటారు. ఎంతటి పెద్ద సినిమా అయిన దీనికి అతీతం కాదు. అయితే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కాటమరాయుడు’ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. ఈ సినిమాకి మొన్న ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారంతే. ఇది తప్పించే ఈ సినిమా ప్రమోషన్ అంటూ ఏదీ జరగలేదు. సినిమా రిలీజ్ కి ముందు కనీసం పేపర్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆనవాయితీ. కాని కాటమరాయుడు విషయంలో అదీ జరగడం లేదు. ఈ సినిమా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వెరైటీగా జరిగింది. ”పవన్ కళ్యాణ్ భజన” కార్యక్రమంగా సాగింది ఈవెంట్. వచ్చిన ప్రతీవోడు ”పవన్.. మహా గొప్ప మనిషి’ అని చెప్పడం తప్పితే.. ఇదీ సినిమా, ఇలా చేశాం,ఇంతమంది నటించారు, టెక్నిషియన్ల కష్టం ఇది.. ఇలాంటి విషయాల జోలికే పోలేదు. ఇప్పుడు కూడా ఇదీ మా సినిమా అని చెప్పడానికి టీం నుండి ఎవరూ ముందుకు రావడం లేదు.
మరి కాటమరాయడు టీమ్ కి ఏమైయింది. సినిమా గురించి చెప్పడానికి మేటర్ ఏం లేదా ? అంటే లేదేమో.! ఈ సినిమా అజిత్’వీరమ్’ కు రీమేక్ మొదటి నుండి ప్రచారం జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ కాస్త మొహమాటంగానే వీరమ్ కధను తీసుకున్నాం అని మొన్న ఈవెంట్ లో చెప్పారు. ఈ సినిమా హెచ్డీ క్వాలిటీతో యుట్యూబ్ లో వుంది ‘వీరుడొక్కడే’ పేరుతో. ఇప్పటికే చాలా మంది సినిమాని చుసేశారు. అందుకే మరీ డీటెయిల్ లోకి పోలేదు పవన్ కళ్యాణ్. అలాగే కధ కూడా ఒక్క ముక్కలో చెప్పేశారు. ”ప్రేమ అంటే ఇష్టం లేని ఓ అన్నయ్యను నలుగురు అన్నదమ్ములు ప్రేమలోకి దించుతారు’.ఇదే కాటమరాయడు కధ. నిజమే వీరం కధ కూడా అంతే. అంతా తెలిసినా వ్యవహరమే. మరి ఈ మాత్రం దానికి ఏం మాట్లాడుదాం అనుకున్నారేమో… ఇంటర్వ్యూ జోలోకి పోవడం లేదు పవన్ కళ్యాణ్.
ఇక్కడ ఇంకో రెండు ఇష్యులు కూడా వున్నాయి. ‘సర్దార్’ సినిమా బాధితులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏవో సమస్యలు పై స్పందించే పవన్ కళ్యాణ్, తన సినిమా వల్ల వచ్చిన సమస్య గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఆయనకు ఎదురయ్యే మొదటి ప్రశ్న. రెండు.. కాటమరాయుడు టికెట్ల రెట్లు పెంచేసి అమ్మతున్నారు. మొదటి రెండు రోజులకు ఎక్కడ రెగ్యులర్ టికెట్లు దొరకడం లేదు. అన్నీ ‘బ్లాక్’ అయిపోయాయి. ఇదెక్కడి పద్దతి అని మరో ప్రశ్న రావచ్చు. ఇలాంటి తలనొప్పి ప్రశ్నలు సమాధానం చెప్పడం ఎందుకు అనే భావనలోకి వచ్చేశారేమో. ఈసారికి మీడియాకు దూరంగా జరిగిపోయారు పవన్ కళ్యాణ్.