సర్దార్ గబ్బర్‌సింగ్‌లాంటి డిజాస్టర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో సూపర్ క్రేజ్ తీసుకురావాలంటే స్పెషల్‌గా ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే బాహుబలి స్టైల్లో వరుసగా స్టిల్స్ రిలీజ్ చేయాలనుకున్నారు. బాహుబలి సినిమాలో అంటే బోలెడన్న క్యారెక్టర్స్, వెరైటీ గెటప్స్ ఉన్నాయి కాబట్టి అందరినీ చూపించారు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి హీరోయిన్‌తో సహా ఎవ్వరికీ ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. శృతీ హాసన్‌లాంటి టాప్ రేంజ్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఏవో నాలుగు సీన్లు, నాలుగు పాటలకు పరిమితం అవ్వడం ఖాయం. అందుకే అన్ని పోస్టర్స్‌లోనూ పవన్నే చూపించాలి. ‘కాటమరాయుడు’ టీం కూడా అదే చేశారు. కాకపోతే అన్ని పోస్టర్స్‌లోనూ పవన్ మొహమే చూపిస్తే కొత్తగా ఏం ఉంటుంది అని అనుకున్నారేమో పవన్ పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. పవన్‌కి దాసాను దాసులైన ఆయన భక్తులు ఆ పాదాలను చూసి పరమానందభరితులు అవుతారని ఆశించినట్టున్నారు. అలా వెనుక నుంచి ఓ సారి ముందు నుంచీ ఓసారి పాదాలను, కాళ్ళను చూపించాక అప్పుడిక ఓ ఫుల్ పోస్టర్ వదిలారు. తీరా ఇప్పటి వరకూ రిలీజ్ అయిన స్టిల్స్ చేస్తే ఏముంది….? ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యేలా ఉంది. అంతడిన్నాడింతన్నాడే అన్నట్టుగా తయారయ్యింది వ్యవహారం.
ఆ మధ్య ఓ సారి మోహన్బాబాపైకి ఒంటి కాలిపైన లేచిన పవన్ ఇప్పుడు అదే మోహన్ బాబు ‘రౌడీ’ సినిమా పోస్టర్ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశాడు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌడీ’ సినిమాను కాపీ కొట్టడంతో వర్మ అభిమానులకు చేతినిండా పనిదొరికింది. సర్దార్ ప్రమోషన్స్ టైంలో పవన్ కూడా వర్మను బాగానే విమర్శించాడు. అప్పుడు పవన్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇఫ్పుడీ కాపీ పేస్ట్ వ్యవహారాన్ని మాత్రం ఎలా సమర్థించుకోవాలో అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. రేపో మాపో ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. సాధారణంగా పవన్ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను పవనే చూసుకుంటాడు. కాబట్టి ఈ పోస్టర్స్ నాకు తెలియకుండా బయటకు వచ్చాయి అని చెప్పే అవకాశం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియాలో ఈ కాపీ పేస్ట్ వ్యవహారంపైన హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాటమారాయుడు టీం ఈ కాపీ వ్వవహారాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి మరి.