కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవి వస్తాడా? చరణ్‌కి ఆహ్వానం అందిందా? ఈ దెబ్బతో బన్నీకీ పవన్‌కీ మధ్య ఉన్న స్పర్థలు తొలగిపోతాయా?? ఈ రేంజ్లో మాట్లాడుకొంటున్నారు సినీ జనాలు. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కీ, పవన్ ఫ్యాన్స్ కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ వివాదాన్ని తెరదించాలని అల్లు అర్జున్ తెగ తాపత్రయ పడిపోతున్నాడని, కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచే.. తన కార్యాచరణ ప్రణాళిక అమలు చేసే వీలుందని చెప్పుకొన్నారు. చిరంజీవి వచ్చినా రాకపోయినా…. మెగా హీరోల్లో ఒకరిద్దరు కాటమరాయుడు ఫంక్షన్ కి రావడం ఖాయమని డిసైడ్ అయిపోయారు.
అయితే… కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా హీరోలెవ్వరికీ ఎంట్రీ లేదు. చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకూ.. ఎవ్వరికీ ఆహ్వానాలు అందలేదు. వేదికపై కాటమరాయుడు టీమ్ మాత్రమే కనిపిస్తారు. అయితే ఒకే ఒక్క స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే త్రివిక్రమ్. పవన్ కల్యాణ్‌కి ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ మాత్రమే కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఆహ్వానం అందిందట. ఆయన చేతుల మీదుగానే… ఈ కార్యక్రమం సాగబోతోంది. అన్నట్టు పవన్‌కి మరో అత్యంత సన్నిహితుడు అలీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు.