రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పవర్ స్టార్ వచ్చేశాడు. రెగ్యులర్‌గా అన్ని సినిమాల్లో కనిపించే కామెడీ పవన్‌లా కాకుండా ఈ ‘కాటమరాయుడు’ చాలా కొత్తగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ మొత్తం మారిపోయింది. పంచెకట్టు, సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కొత్తగా కనిపిస్తున్నాడు పవన్. అలాగే డైలాగ్ డెలివరీ స్టైల్ కూడా మార్చేశాడు. ఫుల్ బేస్ వాయిస్‌తో, హీరోయిజం ఉట్టిపడేలా అదిరిపోయే స్టైల్లో ఎనర్జిటిక్‌గా డైలాగ్ చెప్పాడు పవన్. ‘ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు……ఎవడున్నాడన్నది ముఖ్యం’ అనే డైలాగ్ కూడా బాగానే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ‘కాటమరాయుడు’ హీరోయిజాన్ని సూపర్బ్‌గా ఎలివేట్ చేసింది.
‘గబ్బర్‌సింగ్’ సినిమాతోనే ఊరమాస్ హీరోయిజం ట్రై చేశాడు పవన్. కానీ అందులో ఎక్కువ భాగం కామెడీ టైమింగ్‌ని నమ్ముకున్నాడు. కానీ ఈ సారి ‘కాటమరాయుడు’లో మాత్రం పూర్తిగా సీరియస్ హీరోయిజం చూపించినట్టుగా కనిపిస్తోంది. పవన్ కెరీర్లోనే ఈ తరహా యాక్టింగ్ ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అందుకే తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ స్టైల్ కూడా మార్చేశాడు పవర్ స్టార్. డాలీ వర్క్ కూడా బాగానే ఉంది. ఓవరాల్‌గా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కాటమరాయుడు పవన్ ఫ్యాన్స్‌కి కిర్రెక్కించేస్థాయిలోనే ఉన్నాడు. సినిమాపైన అంచనాలు పెంచేస్థాయిలోనే టీజర్ ఉంది.