బాహుబలిని పుష్ష అన్ని విధాలా ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలిలా పుష్ష 2 భాగాలుగా వస్తోంది. ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. పైగా నిడివి పెరిగిన కారణంగా రెండూ.. రెండు భాగాలుగా రావాలని ఫిక్సయ్యాయి. ఇప్పుడు మరో విషయంలోనూ పుష్ష.. బాహుబలినే ఫాలో అవుతున్నాడు.
బాహుబలి 1 చూశాక.. బాహుబలి 2 చూడాలన్న ఉత్సుకతని కల్పించిన ఎలిమెంట్… కట్టప్ప. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న – బాహుబలి 2 రిలీజ్ అయ్యేంత వరకూ సస్పెన్స్ గానే సాగింది. ఈ క్వశ్చన్… ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రస్ట్ గా మారింది. `బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు` అనే ప్రశ్న సైతం వైరల్ అయ్యింది. ఈ ప్రశ్నని మీమ్స్ చేసే వాళ్లు సైతం రకరకాలుగా వాడుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ట్విస్టే… పుష్ష 1 క్లైమాక్స్‌లో ఉండబోతోందట. ఓ లారీ డ్రైవర్ గా మొదలైన పుష్షరాజ్ ప్రస్థానం..ఎర్రచందనం సామ్రాజ్యం మొత్తాన్ని – చిన్నాభిన్నం చేసి, తనే ఓ డాన్ గా ఎదిగేంత వరకూ సాగుతుంది. ఓ లారీ డ్రైవర్.. డాన్ గా మారడం పుష్ష 1 క్లైమాక్స్ సీన్. అయితే అలా డాన్ గా మారడం వెనుక… విలన్ గ్యాంగ్ లో ఒకరి హస్తం ఉంటుంది. విలన్ గ్యాంగ్ లో ఉంటూనే హీరోకి తెర వెనుక సపోర్ట్ చేసే పాత్రలో ఓ నటుడు కనిపించబోతున్నాడు. అతనెవరన్నది సస్పెన్స్. ఆ సస్పెన్స్ తోనే… ఈ భాగానికి శుభం కార్డు పడుతుంది. ఈ చిక్కుముడి పార్ట్ 2లో రివీల్ చేయబోతున్నార్ట. అలా.. ఓ ఆసక్తికరమైన ప్రశ్నతో పుష్ష 1ని ముగించబోతున్నారు. ఈ విషయంలో బాహుబలికీ పుష్షకీ తేడా ఏమిటంటే.. బాహుబలిలో హీరో నమ్మిన వాడు వెన్నుపోటు పొడిస్తే… పుష్షలో విలన్ గ్యాంగ్ లోని వ్యక్తి హీరోకి సపోర్ట్ చేస్తాడు. అంతే తేడా.