కామారెడ్డి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణరెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య నలిగిపోతారని అనుకున్నారు. కానీ ఆయన ఆ ఇద్దర్నీ ఓడించి.. జెయింట్ కిల్లర్ అయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో కానీ నేత రేవంత్ రెడ్డిని ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్ నిలబెట్టింది. వీరిద్దరూ కామారెడ్డికి నాన్ లోకల్. బీజేపీ లోకల్ నేత అయిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్. కామారెడ్డి నియోజకవర్గం ప్రజలందరితో సన్నిహిత సంబందాలు ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో గత నాలుగైదు ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూ వచ్చారు. వాటికి నాయకత్వం వహిస్తున్నారు .
డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో రైతులకు భారీ నష్టం జరుగుతోందని ఆందోళన చేపట్టిన రైతుల కోసం ఈయన అండగా నిలబడి ఉద్యమానికి నాయకత్వం వహించడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం , ఇలా అనేక ప్రజా ఉద్యమాలతో జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు వెంకటరమణారెడ్డి సంపాదించుకున్నారు . కామారెడ్డిలో కరోనా సమయంలో ప్రజల్ని ఎవరూ ఆదుకోలేదు.
ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. కానీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనీసం యాభై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కనీస అవసరాలు తీర్చారు. ఆ అభిమానం ఓట్ల రూపంలో కనిపించింది. ఒకరు సిట్టింగ్ సీఎం.. మరొకరు సీఎం అభ్యర్థి అయినా వారిద్దర్నీ ఒంటిచేత్తో ఓడించిన నేతగా.. కాటిపల్లి వెంకటరమణారెడ్డి రికార్డు సృష్టించారు. జెయింట్ కిల్లర్‌గా చరిత్రలో నిలిచారు.