‘పవర్ స్టార్’ అనే సినిమా వర్మ పవన్‌పై తీస్తుంటే, వర్మపై పవన్ అభిమానులు `పరాన్న జీవి` అనే సినిమా తీస్తున్నారు. ఏక కాలంలో.. కౌంటర్లు ఇచ్చి పుచ్చుకోవడానికి రెండు సినిమాలు తయారవుతుండడం టాలీవుడ్ చరిత్రలోనే ఇది తొలిసారి. అయినా వీటిని సినిమాలూ అనకూడదు. షార్ట్ ఫిల్మ్స్ అనాలి. నిడివి, క్వాలిటీ పరంగా వర్మ తీస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పవర్ స్టార్’ కూడా అదే బాపతు.
అయితే… నూతన్ నాయుడు దర్శకత్వంలో ‘పరాన్నజీవి’ అనే సినిమా రూపొందుతోంది. కేవలం మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని నూతన్ నాయుడు భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వివాదాస్పద వ్యక్తుల్ని ఎంచుకున్నాడు నూతన్ నాయుడు. కత్తి మహేష్, శ్రీరెడ్డి.. ఇద్దరూ పవన్‌కి యాంటీనే. పవన్‌కి పాజిటీవ్ గా తీయబోతున్న సినిమాలో వీరిద్దరూ నటించడానికి ఎలా ఒప్పుకున్నారు? వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయన్నవి ఆసక్తి కరం. అన్నట్టు… రాంగోపాల్ వర్మగా షకలక శంకర్ కనిపిస్తాడని తెలుస్తోంది.