క్రిటిక్ పేరుతో దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే కత్తి మహేష్‌ను పోలీసులు కొంత కాలం పాటు జైల్లోనే ఉంచాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బెంగళూరులో అల్లర్లు జరిగిన సమయంలో హైదరాబాద్‌లో ఉండి.. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు రాక ముందే.. ఆయనపై మరో ఫిర్యాదు అందిందని చెప్పి..పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని మళ్లీ అరెస్ట్ చూపించారు.
గతంలో హిందువుల మనోభావాలను కించ పరిచేలా పోస్టులు పెట్టారంటూ… హైదరాబాద్ జాంబాగ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లుగా సైబర్ క్రైం పోలీసులు ప్రకటించారు. దీంతో కత్తి మహేష్ మరికొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. పోలీసులు తల్చుకుంటే…కత్తిమహేష్‌ను మరికొంత కాలం జైల్లోనే ఉంచగలరు. ఎందుకంటే గతంలో రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో పలువురు ఆయనపై ఫిర్యాదు చేసి ఉన్నారు.
అప్పటి వివాదంలో ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కత్తి మహేష్‌కు ఆ చాయిస్ కూడా ఇవ్వాలనుకుంటున్నట్లుగా లేదు . అందుకే అరెస్ట్ చూపించేస్తున్నారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. టీవీల్లో షోలు చేస్తున్నారు. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి.