నిత్య విమర్శకుడు మహేష్ కత్తి ఈ రోజు ఏవరూ ఉహించని ఆరోపణలు చేశాడు. పవన్ కళ్యాణ్ ని విమర్శించడంలో సర్వ హక్కులు నావే అని గత కొన్నాళ్ళుగా విమర్శల దాడి కొనసాగిస్తున్న మహేష్ కత్తి.. ఈ రోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఓపెన్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమం పెట్టాడు. ఇందులో మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మొన్న హీరోయిన్ పూనమ్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సాయంతో ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని కామెంట్ చేసిన మహేష్.. ఈ రోజు ఎవరూ వూహించని వ్యాఖ్యలు చేశాడు.
పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ఒకే నామ గోత్రాలతో తిరుపతిలో ఎందుకు పూజలు జరిపించుకున్నారు ? పూనమ్ కౌర్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేసుకుంది ? హాస్పిటల్ లో బిల్లు ఎవరు కట్టారు ? పవన్ కళ్యాణ్, పూనం తల్లికి ఏమని ప్రామిస్ చేశారు ? త్రివిక్రమ్, పూనమ్ కి మధ్య వున్న లింక్ ఏమిటి ? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ జరిపిన క్షుద్ర పూజలలో పూనం ఏం చేసింది? వీటిపై ఆధారాలు నా దగ్గర వున్నాయి. అవసరం అయినప్పుడు బయటపెడతాను. దమ్ముంటే నాపై పరువునష్టం దావా వేసుకోండి. ఎదుర్కోవడానికి నేను రెడీ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మహేష్ కత్తి.
నిజంగా ఇవి సంచలన వ్యాఖ్యలే. ఎవరూ వూహించని వ్యాఖ్యలు. ఈ రోజు అంతా ‘అజ్ఞాతవాసి ట్రైలర్ హాట్ టాపిక్ అని అనుకున్నారంత. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూనమ్ ను ముడి పెడుతూ మహేష్ చేసిన వ్యాఖ్యలు అజ్ఞాతవాసి వేడిని సైతం డామినేట్ చేశాయి. అంతే కాదు ఈ ఆరోపణలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి. మరి ఈ వ్యవహారం ముందు ముందు ఎలా ముదురుతుందో చూడాలి.