అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి … కీలకమైన ఓటింగ్ బేస్ అయిన.. తెలంగాణ వాదులు… అతకంతకూ దూరమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎలాంటి ఆదరణ లేని సమయంలో ఉద్యమాన్ని నమ్ముకుని… కేసీఆర్కు అండగా నిలిచిన నేతలంతా ఒక్కొక్కరుగా .. టీఆర్ఎస్కు గుడ్ బై చెబుతున్నారు. మొన్నటికి్ మొన్న కూకట్ పల్లి నుంచి గొట్టిముక్కల పద్మారావు, నిన్న కుత్బుల్లాపూర్ నుంచి కొలన్ హన్మంతరెడ్డి, ఖమ్మం నుంచి బుడాన్ బేగ్ లతో పాటు.. చివరికి తెలంగాణ జాగృతిలో పని చేసిన కీలక నేత కూడా… పార్టీలు మారిపోయారు. తాజాగా. . ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే … కావేటి సమ్మయ్య కూడా… తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతకు నమస్కారం పెట్టారు. ఆయనకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచి… టీఆర్ఎస్ లో చేరిన కోనేరు కనప్పకు… కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. గతంలో… కావేటి సమ్మయ్య… టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో .. ఓడిపోయారు. అయితే.. ఉద్యమకారునిగా టీఆర్ఎస్ అధినేతతో సుదీర్ఘ కాలంగా పయనిస్తున్నారు. అయితే ఇక్కడ.. కావేటి సమ్మయ్య లేవనెత్తిన అంశం విభిన్నమైనది. ఆయన ఆంధ్రా .. ఆంధ్రా అంటూ… సెంటిమెంట్ రాజేయడానికి ప్రయత్నిస్తున్న అంశాన్నే… లేవనెత్తారు. గతంలో తాను ప్రస్తుతం టిక్కెట్ ఇచ్చిన కోనేరు కోనప్పను… ఆంధ్రా అప్ప అంటూ విమర్సించారు. ఆయనకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయవద్దని.. కోరారు. అలాంటి నేతను.. ఇప్పుడు… నెత్తికెక్కించుకుని .. టిక్కెట్ ఇచ్చి.. తన లాంటి నేతను ఘోరంగా అవమానిస్తున్నరని కావేటి సమ్మయ్య అసంతృప్తికి గురయ్యారు. సిర్పూర్ లో … కేసీఆర్ సభ పెట్టినా.. కనీసం సమాచారం కూడా పంపకపోవడంతో… ఇక .. టీఆర్ఎస్లో తన లాంటి ఉద్యమకారులకు చోటు లేదని.. రాజీనామా చేసేశారు. తుమ్మల నుంచి… మహేందర్ రెడ్డి వరకు.. తేలంగాణ ద్రోహులుగా ఉన్న వారు.. టీఆర్ఎస్లో అందలం ఎక్కడమే కాదు.. ఆంధ్రా అప్పలుగా.. కేసీఆర్తో తిట్టించుకున్న వారే ఇప్పుడు ఆయనకు ఆప్తులయ్యారు. కోదండరాం నుంచి సమ్మయ్య వరకూ.. ఉద్యమకారులు చేదయ్యారు.