బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరుదైన ఆహ్వానం లభించింది. ప్రపంచంలోనే అత్యుత్తుమ యూనివర్శిటీల్లో ఒకటి అయిన ఆక్స్ఫర్డ్లో తెలంగాణ అభివృద్ధిపై ప్రసంగించేందకు ఆమెకు ఆహ్వానం అందింది. ఈ నెల 30వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించారు. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు.
ఆక్స్ ఫర్డ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయంగా తెలిసేలా కవిత వివరించనున్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని వివరించనున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత అనేక అంతర్జాతీయ సంస్థల ఆహ్వానం మేరకు వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని వివరించారు.