హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు ఓటుహక్కు ప్రాధాన్యం తెలిపేందుకుగానూ తెలంగాణ జాగృతి సంస్థ నెక్లెస్ రోడ్లో ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రజలలో ఓటుహక్కుపై అవగాహన కలిగించటంకోసం ‘రైట్ ఫర్ ఓట్’ అని రాసి ఉన్న బ్యానర్లను, గాలిపటాలను, బెలూన్లను విడుదల చేశారు. తర్వాత అక్కడకు వచ్చినవారినుద్దేశించి కవిత మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. ఓటు ఎవరికి వేయాలనేది తమ తమ విచక్షణనుబట్టి నిర్ణయించుకోవచ్చని, కానీ ఓటు మాత్రం తప్పనిసరిగా వేయాలని సూచించారు. నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మామూలుగా చీర, జాకెట్ ధరించి జుట్టు విరబోసుకుని కనిపించే కవిత ఇవాళ విభిన్నంగా లంగా, జాకెట్ లాంటి డ్రస్ వేసుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.