తెలంగాణ జాగృతి కవిత తన రాజకీయ పరిధిని విస్తృతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి ద్వారా రాజకీయం జోరుగా చేస్తున్నారు. అయితే ఇదంతా తెలంగాణ కోసమే అన్నట్లుగా కవరింగ్ ఇస్తున్నారు. ఓ వైపు బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తూనే తాజాగా ప్రాజెక్టులపై అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు – నిజాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావుల్ని పిలిచి.. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడనున్నారు.
ఏపీలో ప్రాజెక్టులు కట్టేసి.. తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఆపేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఇటీవల ప్రచారం చేస్తోంది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును ప్లాన్ చేశారని.. అది కడితే గోదావరి నీళ్లు తెలంగాణకు రావని ఆయన అంటున్నారు. వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుందని.. వాటిని మళ్లించుకుంటే రాయలసీమ కరువు తీరుతుందని చంద్రబాబు అంటున్నారు. అత్యంత దిగువ రాష్ట్రం ఏపీ అయినా.. ఎగువ రాష్ట్రం తెలంగాణ అయినా జల రాజకీయాలు ప్రారంభించింది. అయితే దీన్ని బీఆర్ఎస్ అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లకపోవడంతో… కవిత అందిపుచ్చుకుంటున్నారు.
కవిత తన రాజకీయాలను జాగృతి ద్వారా చేస్తున్నారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ బీఆర్ఎస్ కు తాను దూరమన్న సంకేతాలు ఇవ్వకుండా.. .. రాకుండా జాగ్రత్తపడుతున్నారు. బీఆర్ఎస్ పేరు మీద ప్రాజెక్టులు.. ఇతర రాజకీయాలు చేయడం కన్నా.. జాగృతి ద్వారా చేయడమే మంచిదని ఆమె అనుకుంటున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం ఉందో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.