బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన కవిత.. ఈ వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళగానే సైలెంట్ అయిపోయారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు కేంద్రం చేతుల్లోనే ఉంది. కేంద్రం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా నాన్చుతోంది. అయినా.. బీసీల కోసం ఉద్యమం చేపడుతున్నానన్న కవిత.. కేంద్రంపై పోరాటానికి సంకోచిస్తున్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో బీసీ సంఘాలు చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఢిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. పీసీసీ కార్యవర్గం అంతా ఈ దీక్షలో భాగస్వామ్యం అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం హడావిడిగా ఢిల్లీలో దీక్షలు చేపట్టిన కవిత.. బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాత్రం కేంద్రంపై పోరాటానికి వెనుకంజ వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడినట్టు చేసిన కవిత ఇదే అంశంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నది కాంగ్రెస్ వర్గాల ప్రశ్న. అయితే , కేంద్రంపై గట్టిగా మాట్లాడితే లిక్కర్ స్కామ్ కేసును మళ్లీ తిరగదోడుతారని భయంతోనే కవిత మౌనం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఈ వాదనను తిప్పికోట్టాలంటే కేంద్రంపై బీసీ రిజర్వేషన్ల కోసం ఒత్తిడి పెంచే కార్యాచరణ అయినా కవిత ప్రకటించాల్సింది..మరి కవిత ఏం చేస్తారో