ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఉదయం పదకొండు గంటలకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో మీడియా సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. అందుకే ఆలస్ంగా వెళ్తారని అనుకున్నారు అయితే మీడియా సమావేశం పెట్టలేదు. కానీ పదకొండు గంటలకు కవిత లాయర్ ఓ లేఖను తీసుకుని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లేఖలో ప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని.. తెలిపారు. మహిళలను ఇంటిదగ్గరే విచారించాలనే నిబంధనల ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఈడీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇంటి దగ్గరే ప్రశ్నించాలనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని.. ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో బుధవారం పటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణను 24వ తేదీన చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అదే సమయంలో కవిత లాయర్ ఈడీకి లేఖ ఇచ్చిన తర్వాత ఈడీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. ఈడీపై తీవ్రమైన ారోపమలు చేశారు. కవితపై కేంద్రం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టింది ఇబ్బంది పెట్టాలని చూస్తోందని కవిత తరపు లాయర్ భరత్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ ఈడీ ఎదుట కవిత హాజరు కావడం లేదని ఆయన ప్రకటించారు. మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలన్న నిబంధన పాటించడం లేదు కాబట్టే హాజరు కావడం లేదన్నారు.
కవిత విచారణకు సహకరించడం లేదన్న అభిప్రాయానికి ఈడీ వస్తే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజా పరిణామాల ద్వారా అంచనా వేస్తున్నారు. విచారణకు హాజరైన తర్వాత అయినా ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే .. ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వచ్చి..ఢిల్లీలోనే ఉన్న కవిత చివరి క్షణంలో ఈడీ ఎదుట హాజరు కావడానికి వెనుకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది.