పార్టీలో ఒంటరైపోయి, టికెట్ దక్కదని తెలిసిపోయి… ఉనికి కోసం పాట్లు పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనపడుతోంది. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో ఉంటే… డైరెక్టుగా ఎదుర్కోలేక ఇప్పుడు చంద్రబాబును మధ్యలోకి లాగి రాజకీయం మొదలుపెట్టారు.
ఒకప్పుడు కేసీఆర్ కే రాజకీయంగా ఎన్నో అవకాశాలను ఇచ్చిన చంద్రబాబును పచ్చ అంకుల్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గురువు అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని ఆర్థికంగా , రాజకీయంగా పబ్బం గడుపుకున్న కల్వకుంట్ల కుటుంబం… ఇప్పుడు అధికారం పోయే సరికి మళ్లీ సెంటిమెంట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రా అధికారులు, చంద్రబాబును లాగి మళ్లీ రాజకీయం చేయాలనుకుంటున్నా… ఆ కుటుంబాన్ని ఇప్పటికే ఛీదరించుకుంటున్న తెలంగాణ ప్రజలు వీరి ఆటలను సాగనివ్వరని, అవినీతి చేసి వేల కోట్ల రూపాయాలు దోచుకున్న నిజాల్ని ప్రజలు మర్చిపోరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.