సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదని కేసీఆర్ నిర్ణయించారు. అధికారం పోయింది కాబట్టి.. ఖచ్చితంగా ఓడిపోతామని ఆ పేరు ఎందుకన్నట్లగా కేసీఆర్ పోటీ వద్దని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుంధంగా ఉన్న తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉండి… గెలుపుని సీరియస్ గా తీసుకున్న కవిత.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. హఠాత్తుగా పోటీ చేయవద్దని కేసీఆర్ ఆదేశించడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. కార్మిక సంఘం నేతలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరేందకు సిద్ధం అయ్యారు.
దీంతో వాళ్లంతా కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. ఇక కార్మిక సంఘాల్లో బీఆర్ఎస్ ఉనికే ఉండదని ఆందోళన చెందారు. ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని.. ప్రకటించారు. కేసీఆర్ మాటను పట్టించుకోకుండా.. ఎన్నికల్లో నిలబడతామని.. ఎవరూ కార్మిక సంఘం వీడొద్దని సందేశం పంపారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఒకప్పుడు బీఆర్ఎస్కు అసలు పట్టు ఉండేది కాదు. ఉద్యమం పుణ్యాన కొత్త సంఘం ఏర్పాటు చేసుకుని.. ఆ సంఘంలో అందర్నీ చేర్చుకోలిగారు.
ఇప్పుడు సెంటిమెంట్ లేకపోవడం.. అధికారం కూడా పోవడంతో ఆ సంఘం ఉనికి కష్టమవుతుంది. కవిత మాత్రం.. పట్టుదలగా ఉన్నారు. కార్మికులు అధికార పార్టీ తరపున నిలబడితే .. కవితకు మరో పరాజయం ఎదురైనట్లు అవుతుందని బీఆర్ఎస్ పెద్దల్లో ఆందోళన కనిపిస్తోంది.