కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నీడ నుంచి బయటకు వచ్చేశారని ఇక ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరన్న సంకేతాలు వస్తున్నాయి. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్‌కు గురైన హాస్టల్ విద్యార్థులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. వారితో పాటు కవిత వెళ్లలేదు. తాను సొంతంగా వెళ్లారు. తనతో పాటు కొంత మంది జాగృతి నేతల్ని తీసుకెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాలేదు. ప్రభుత్వంపై మాత్రం విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత కవిత సైలెంటుగానే ఉన్నారు. అనారోగ్యకారణాలు .. సరైన సమయం కోసం ఆమె చూస్తూ ఉన్నారని భావించారు. దానికి తగ్గట్లుగానే అదానీ ఇష్యూ బయటకు రాగానే ట్వీట్లు చేశారు. తర్వాత రోజు బయటకు వచ్చారు. రాజకీయాలకు దూరమయ్యేందుకు ఆమె సిద్దంగా లేరని.. బీఆర్ఎస్ కాకపోతే సొంత రాజకీయం చేస్తారని అంటున్నారు. ఆమె రాజకీయంగా దూరంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంతర్గతంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి.
భారత జాగృతిని.. మళ్లీతెలంగాణ జాగృతిగా మార్చారు. బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయబోతున్నారు. తర్వాత మరో టాపిక్ అందుకుంటారు. ఇవన్నీ బీఆర్ఎస్ కన్నా. భిన్నంగా ఉండబోతున్నాయి. చివరికి ఎన్నికల వరకూ ఆమె జాగృతి నేతగానే రాజకీయాలు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు దూరం కావడం వెనుక బీఆర్ఎస్ ఫ్యామిలీలోఅంతర్గతంగా ఏం జరిగిందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.