తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రత్యేక సంస్థ ద్వారా చేశారు. ఈ జాగృతి సంస్త ద్వారా ఆమె చాలా కార్యక్రమాలు చేపట్టారు.. కానీ బతుకమ్మ మాత్రం బ్రాండ్‌గా మారపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జాగృతి ద్వారా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు . కేసీఆర్ అధికారికంగానే నిధులు కేటాయించారు. రాను రాను జాగృతి కార్యకలాపాలు తగ్గిపోయాయి. అయితే హఠాత్తుగా కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశారు. కవిత సీబీఐ కేసులతో సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో కేసీఆర్ తాను కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతితో ఎలా ఉద్యమం చేశారో.. అలా బీఆర్ఎస్ తరపున దేశమంతా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తనకు కూడా ఎంతో అవసరమని నిర్ణయించి.. రాత్రికి రాత్రి అనుకుని లంగాణ జాగృతి విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని … మనం ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో మనకు ఒక శాఖ సిద్ధమవుతుందని జాగృతి సభ్యులకు ధైర్యం చెప్పారు. బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్నారు.
ఎవరు మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. నాపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్నాయి.. దాడులకు నేను భయపడనని ప్రకటించారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై .. ఉద్యమ స్పూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు. అంతా బాగానే ఉందికానీ.. అసలు బతుకమ్మ అనేదే తమకు లేదని దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల వాళ్లు చెబుతూ ఉంటారు. అలాంటిది దేశం మొత్తం అంటే.. వర్కవుట్ అవుతుందో లేదో చెప్పడం కష్టం. అదే సమయంలో తెలంగాణ జాగృతి పేరును కూడా భారత్ జాగృతి అని మారుస్తారేమో చూడాల్సి ఉంది.