హైదరాబాద్: మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి, కొద్దికాలం కేంద్రమంత్రిగా కూడా పనిచేసి, ఇటీవల భారతీయ జనతాపార్టీలో చేరిన సీనియర్ నాయకుడు కావూరి సాంబశివరావు 18 జాతీయ బ్యాంక్‌లకు రు.1,000 కోట్ల మేరకు టోపీ పెట్టినట్లు బయటకొచ్చింది. కావూరికి చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రోగ్రెసివ్ ఫ్యాబ్రికేషన్స్ సంస్థ పేరుమీద ఈ వేయికోట్ల అప్పులు ఉన్నాయి. బకాయిల వసూలు కోసం ఆ 18 బ్యాంక్‌లు నాలుగేళ్ళనుంచి ఎన్ని నోటీసులు జారీ చేిసనా ఆ సంస్థ ఈ అప్పులను చెల్లించకపోతుండటంతో ఆ బ్యాంక్ అధికారులు ఇవాళ హైదరాబాద్ ఆబిడ్స్‌లోని చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న ప్రోగ్రెసివ్ ఫ్యాబ్రికేషన్స్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. రుణాలు చెల్లించి బ్యాంకులు దివాళా తీయకుండా చూడాలని కావూరిని కోరారు. కావూరి కుమార్తె శ్రీవాణి ఈ కంపెనీకి ఎండిగా ఉన్నారు. సుల్తాన్ బజార్‌లోని ఆంధ్రాబ్యాంక్ ఒక్కదానికే రు.200 కోట్ల బకాయి ఉంది.