ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని చంద్రబాబునాయుడు… 50 లక్షల ఎస్ఎఫ్టీ పరిధిలో కడుతున్నారని.. దాని కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని… ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెగ బాధపడిపోయారు. చంద్రబాబు ఏపీ అసెంబ్లీ భవనం గురించి చాలా సార్లు విడమర్చి చెప్పారు. ఆ భవనం ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచారు. వారి దగ్గర్నుంచి సలహాలు.. సూచనలు తీసుకున్నారు. అసెంబ్లీ భవనంలో… ఎంత మేర.. ఏయే సమావేశాలు మందిరాలు.. హాల్స్… ఉంటాయో.. వివరంగా చెప్పారు. అందులో సీక్రెట్టేమీ లేదు. ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీలు కట్టినా.. దానికో పర్పస్ ఉంటుంది. ఆ విషయంలో ఏపీ ప్రజలకు క్లారిటీ ఉంది. దానిపై కేసీఆర్ చింత పడాల్సిన అవసరం లేదు .. అందులో మోసం చేసేంత … విషయమూ లేదు.
కానీ.. కేసీఆర్ చెబుతున్న దాని ప్రకారం.. చూస్తే.. ఓ అంశాన్ని ఆయన మొహం మీదేనే అడగక తప్పదమో..? అదేమిటంటే… ప్రగతి భవన్ ను ఎన్ని ఎస్ఎఫ్టీల్లో కట్టారు..? అందులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి…? బాత్రూమ్లను కూడా బుల్లెట్ ఫ్రూఫ్ చేయిచుకోవడం నిజమా.. ? కాదా..? అసలు ప్రగతి భవన్‌కు సంబంధించి అంత సీక్రెసీ ఎందుకు మెయిన్ టెయిన్ చేయడం…? నాలగున్నరేళ్లలో.. కేసీఆర్.. ఏం చేశారు..? తెలంగాణలో మౌలిక వసతులను పెంచే ఒక్క ప్రాజెక్టులైనా ప్రారంభించారా…? కనీసం.. ఓ వంద.. రెండు వందల కోట్ల రూపాయల చిన్న ప్రాజెక్టును కూడా.. ప్రారంభించలేకపోయారు. అలాంటిది… ప్రగతి భవన్‌ను మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. అంతకు ముదు సీఎం క్యాంపాఫీస్ లేదా.. అంటే… ఉంది. వైఎస్… సీఎం అయిన తర్వాత… మొట్టమొదటగా అప్పట్లో వంద కోట్ల రూపాయలు పోసి కట్టించుకున్న క్యాంపాఫీస్ ఉండగానే.. వాస్తు రాలేదని.. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లను కూలగొట్టి మరీ.. దాదాపుగా ఐదు వందల కోట్లు పెట్టి.. ప్రగతి భవన్ నిర్మించారు.
ఆ ప్రగతి భవన్ మొత్తం.. రహస్యమే. అందులో ఎన్ని గదులుంటాయో ఎవరికీ తెలియదు. ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అంత కంటే తెలియదు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే.. శాసనసభ్యులందరూ .. డిమాండ్ చేసినా.. చూపించడానికి… మనసు రాలేదు. అదేమైనా నా.. బిల్డింగా.. ప్రజలది.. అని కవర్ చేసుకున్నారు కానీ.. ఆ బిల్డింగ్ లోపల ఏముందో.. ప్రజలకు చూపించాడనికి ఎందుకు సంకోచిస్తున్నారు. కేసీఆర్ .. ఆయన కుటుసభ్యులు.. మహా అయితే.. నలుగురైదుగురు ఉండటానికి ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీలు కట్టించారు…? ఇవన్నీ చెప్పలగరా..? ఇంకా కట్టని.. ఓ ఐకానిక్‌లా ఉండాలనుకుంటున్న.. ఏపీ అసెంబ్లీ గురించి ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీలని వెటకారాలేడే బదులు.. ముందుగా… నిర్మించేసిన ప్రగతి భవన్‌ను గురించి.. కాస్తంత తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వొచ్చుగా.. ! ప్రజలు ఎవరిది మోసమో తేల్చుకుంటారు..!