నిజామాబాద్ లో నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కేసీఆర్… వెంటనే స్పందించారు. మోడీ సభ ముగిసన వెంటనే… ఆయన పాల్గొన్న ప్రచారసభలో మోడీపై మండిపడ్డారు. మోడీ గ్రహచారం బాగోలేక …మనతో పెట్టుకున్నారని.. ఆయన తెలితక్కువ ప్రధాని అని తేల్చారు. . నిజామాబాద్ పూర్తిగా వెనుకబడిపోయిందని.. అక్కడి ప్రజలకు నల్లా నీళ్లు ఇచ్చిన తర్వాత ఓట్లు అడుగుతానన్నారని.. కానీ నీళ్లు ఇవ్వకుండానే మళ్లీ ఓట్లు అడగడమేమిటని ప్రశ్నించారు. దీనిపై.. కేసీఆర్ మోడీకి సవాల్ చేశారు. హెలికాప్టర్ ఎక్కి మహబూబ్‌నగర్ నుంచి నేరుగా నిజామాబాద్‌కే వస్తా… దమ్ముంటే నిజానిజాలేంటో నిజామాబాద్‌లోనే తేల్చుకుందామని సవాల్ చేశారు. ప్రధానమంత్రి తప్పుడు మాటలు మాట్లాడొచ్చునా? ఇంత అల్పంగా మాట్లాడొచ్చునా? అని ప్రశ్నించారు.
మోడీ దరిద్రపుగొట్టు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లొచ్చి.. బీజేేపీతో కుమ్మక్కయ్యాని అంటారని.. బీజేపీ వాళ్లొచ్చి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారంటారని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. మోడీపై విమర్శలతో పాటు.. వ్యూహాత్మకంగా.. మజ్లిస్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. మోడీని ఢీకొడుతున్నది తానేనని చెప్పుకోవడానికి… ప్రయత్నించారు. మోడీని ఢీకొట్టడానికి చంద్రబాబు భయపడ్డారని… తనకేం భయం లేదన్నారు. మజ్లిస్ పార్టీ తమ మిత్రపక్షమని నేరుగా చెప్పుకున్నారు.
మోడీతో లోపాయికారీ పొత్తల కారణంగా.. మజ్లిస్ సన్నిహిత సంబంధాలు ఉన్నా.. ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. కేసీఆర్.. మోడీ పర్యటనను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. మోడీతో తానే పోరాడినట్లు ..చెప్పుకునేందుకు ప్రజలకు చెప్పుకునేందుకు మోడీ టూర్ ని ఉపయోపయోగించుకుంటున్నాయి.