ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతుండగానే ఆయన ఊహించని షాక్ ఇచ్చారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై కేసీఆర్ చేసిన ప్రకటనతో సభలో రేవంత్ – కేసీఆర్ మధ్య టగ్ వార్ ఉంటుందని అంతా భావించారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా కొంత శ్రమించాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం సభకు డుమ్మా కొట్టేశారు. రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచిన కేసీఆర్ సభలో అస్త్రశస్త్రాలతో అధికార కాంగ్రెస్ ను ఉతికారేస్తారని అనుకుంటే ఆయన సభకు గైర్హాజరు కావడం అందర్నీ విస్తుపోయేలా చేసింది.
Also Read : రేవంత్ ఇన్విజిలేషన్.. కేసీఆర్ పాస్ అవుతాడా?
చీల్చి చెండాడుతానని ప్రకటించిన కేసీఆర్ ఎటు వెళ్ళారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీ బయట కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేస్తున్నారు. అసెంబ్లీలో రేవంత్ ను ఎదుర్కొనే విషయంలో కేసీఆర్ ఆందోళనతో ఉన్నారని అందుకే సభకు డుమ్మా కొట్టారని అంటున్నారు. మొత్తానికి.. కేసీఆర్ శనివారం అసెంబ్లీకి హాజరై తన మార్క్ ప్రసంగంతో ఏదో చేస్తారని అంచనా వేస్తే, సభకు డుమ్మా కొట్టి ఉసూరుమానిపించినట్లు అయింది.