చత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మీరు హైకోర్టు జడ్జిగా రిటైర్ అయినప్పటికీ మీరు సహజ న్యాయసూత్రాలు పాటించటం లేదని… మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు మీరు కనపడుతుందని ఎదురుదాడి చేశారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ జులై 30వరకు గడువు కోరగా, కమిషన్ జూన్ 15వరకే టైం ఇస్తామని తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్ సమాధానంపై ఆసక్తి నెలకొనగా… కేసీఆర్ వివరణ కాకుండా ఎదురుదాడి చేస్తూ 12పేజీల లేఖను సంధించారు.
మీ వ్యాఖ్యలు ఏవీ చూసిన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న ఉద్దేశమే ఉందని… అలాంటప్పుడు నేను ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోరని, న్యాయంగా రిపోర్టు ఇచ్చే అవకాశం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు.
ఇప్పటికే తప్పు జరిగిపోయిందని, కేవలం నష్టాన్ని అంచనావేయటమే మిగిలి ఉన్నట్లుగా మీ మాటలు ఉన్నాయని… మా వైపు నుండి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఎంక్వైరీ నుండి స్వచ్ఛందంగా వైదొలగాలని అడ్వైజ్ ఇచ్చారు.
దీనిపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.