టాలీవుడ్ పెద్దల కృషి ఫలిచించింది. సినిమా,టీవీ కార్యక్రమాల షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ..తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాసినిమా, టివి కార్యక్రమాల షూటింగులు ప్రారభించడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే సినిమా ధియేటర్లకు మాత్రం..ఇంకా అనుమతి ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..ధియేటర్లకు అనుమతి లేనందున.. తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. చిరంజీవి నేతృత్వంలో కొంత మంది బృందం..మళ్లీ షూటింగ్‌ల ప్రారంభోత్సవానికి తెలంగాణ సర్కార్‌తో సంప్రదింపులు జరిపారు. కేసీఆర్‌తోనూ సమావేశమయ్యారు. సినీరంగ ప్రముఖులతో మంత్రి తలసాని..ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేయగా..కేసీఆర్ సంతకం చేశారు.
పెద్ద పెద్ద సినిమాల షూటింగ్‌లు ప్రస్తుతానికి ఆగిపోయాయి.వాటిని వెంటనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో టీవీ ఇండస్ట్రీ ఎక్కువగా లాభపడనుంది. పాత సీరియళ్లు, ప్రోగ్రామ్స్‌తో ఎంటర్టెయిన్మెంట్ చానళ్లు టైంపాస్ చేస్తున్నాయి. ఇప్పుడు…అన్నింటి షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఫ్రెష్ ఎపిసోడ్స్‌తో మళ్లీ టీవీ చానళ్లు రేసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.