భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఎల్కతుర్తి సభలో రేవంత్ రెడ్డి పేరును ఒక్క సారి కూడా ప్రస్తావించ లేదు. కేసీఆర్ ఎవరికైనా తన మాటల ద్వారా ప్రాధాన్యం వస్తుందని అనుకంటే వారి ప్రస్తావన తీసుకురారు. అలాగే వారు తన కంటే చాలా తక్కువ అనుకున్నా సరే మాట్లాడరు. గతంలోనూ ఆయన రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించిన సందర్భాలు తక్కువే ఉన్నాయి. అయితే ఇప్పుడు రేవంత్ సీఎం అంతకు మించి.. కేటీఆర్ .. కాంగ్రెస్ పార్టీని కాక రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారు. రేవంత్ ను బలహీనపరిస్తే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారు.
కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయితే.. కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదు. ప్రతీ దానికి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీపై సానుభూతి చూపిస్తున్నారు. రేవంత్ వల్ల ఆ పార్టీ దెబ్బతింటోందని రాహుల్ గాంధీకి లేఖలు రాస్తున్నారు. కేటీఆర్ అనుసరిస్తున్న ఈ ఫార్ములాను కేసీఆర్ మాత్రం ఫాలో అవడం లేదు. ఆయన ఎల్కతుర్తిలో కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. నెంబర్ వన్ విలన్ ..కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కేటీఆర్ చేసినట్లుగా రేవంత్ ను టార్గెట్ చేస్తే.. ఎలా ఉండేదో కానీ పార్టీ పరంగా టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ తన తండ్రి చూపించిన రాజకీయ బాటనలో నడిచి.. రేవంత్ రెడ్డిని కాక… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే.. మంచిదా లేకపోతే.. కాంగ్రెస్ పార్టీ బలం రేవంత్ .. రేవంత్ ను చూసే ఓట్లేశారని ఆయనను బలహీనం చేస్తే మంచిదా అన్నదానిపై పార్టీ పరంగా ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని క్యాడర్ కోరుకుంటున్నారు. లేదు చెరో పాలసీని ఫాలో అప్ అయినా నష్టం ఉండదని.. అనుకుంటే అదే కంటిన్యూస్ చేసే అవకాశం ఉంది. కానీ క్యాడర్ లో మాత్రం కన్ ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది.