తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యశోదలో యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులుగా నీరసంగా ఉంటూడటం.. ఎడమ చేయి లాగుతున్నట్లుగా అనిపించడంతో విషయాన్ని వైద్యులకు చెప్పారు. కేసీఆర్‌కు గుండెకు సంబంధించిన సమస్య ఉండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంలో వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఉదయమే కుమారుడు కేటీఆర్‌తో సహా ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌కు వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలోకి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కేసీఆర్ బాగా నీరసంగా కనిపించారు.
యాంజియోగ్రామ్ పరీక్షలో అంతా నార్మల్‌గానే ఉందని.. ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు చెప్పిటన్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీరావు.., కేసీఆర్‌కు ఎలాంటి అనారోగ్యం లేదని కేవలం మెడికల్ చెకప్స్ కోసమే వచ్చారని స్పష్టం చేశారు. జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. యాదాద్రి పునం ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కేసీఆర్ యాదాద్రిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా వాయిదా వేసుకున్నారు.
కేసీఆర్ ఎప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నా యశోదాలోనే చేయించుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడే్ చేయించుకున్నారు. అయితే్ కేసీఆర్ ఆస్పత్రిలో జాయినవుతారా లేకపోతే.. పరీక్షల తర్వాత ఇంటికెళ్తారా అన్నదానిపై స్పష్టత లేదు. సీఎం కేసీఆర్కుఓ సారి కరోనా వచ్చింది. ఆరోగ్య పరంగా కొనని సమస్యలు ఉండటంతో ఆయనను అబ్జర్వేషన్లో ఉంచారని వైద్యులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.